అమెరికాలో ఉన్న భారతీయులకు ఇప్పుడు ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అక్కడికి వెళ్లిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. గూగుల్ (Google), యాపిల్ (Apple) వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్న విదేశీయులు, ముఖ్యంగా వర్క్ వీసాలపై ఉన్నవారు అంతర్జాతీయ ప్రయాణాలు (ముఖ్యంగా సొంత దేశాలకు వెళ్లడం) పెట్టుకోవద్దని అంతర్గత మెమోలను పంపాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. కొత్తగా H-1B (H-1B Visa) వీసా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏకంగా 1,00,000 డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) ఫీజు చెల్లించాలని నిర్ణయించడం ఇప్పటికే షాక్ ఇచ్చింది. తాజాగా వీసా స్టాంపింగ్ ప్రక్రియలో వస్తున్న జాప్యం ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
Read Also: America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్
అమెరికా వెలుపల ఉన్న యూఎస్ ఎంబసీలలో అపాయింట్‌మెంట్లు దొరకడానికి ఇప్పుడు ఏకంగా 12 నెలల సమయం పడుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు కేవలం మీ రెజ్యూమె చూసి వీసా ఇవ్వడం లేదు. దరఖాస్తుదారుడితో పాటు వారి కుటుంబ సభ్యుల లింక్డ్ ఇన్ (LinkedIn) ప్రొఫైల్స్, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), ఫ్యాక్ట్ చెకింగ్, కంటెంట్ మోడరేషన్ లేదా ఆన్‌లైన్ సేఫ్టీ రంగాల్లో పనిచేసిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ఈ లోతైన తనిఖీల వల్ల వీసా స్టాంపింగ్ ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి గూగుల్, యాపిల్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలమంది ఐటీ నిపుణులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. పెళ్లిళ్లు, పండుగలకు ఇండియా రావాలనుకున్న వారు తమ ప్లాన్లను రద్దు చేసుకుంటున్నారు. గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ఇప్పటికే సెప్టెంబర్ నుంచి తన ఉద్యోగులను దేశం దాటవద్దని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ తీసుకురావడంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. ఏదేమైనా అమెరికా వీసా విధానంలో వస్తున్న ఈ మార్పులు కేవలం ఉద్యోగులనే కాదు.. కంపెనీలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: