📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Apache Helicopters : అమెరికా నుంచి భారత్ కు అపాచీ హెలికాప్టర్ల డెలివరీ!

Author Icon By Sudha
Updated: July 16, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ఆర్మీకి మరింత బూస్ట్‌ అందనుంది. అమెరికా నుంచి వచ్చేవారం మూడు అపాచీ హెలికాప్టర్‌లు (Apache Helicopters) భారత్‌ (India)కు రానున్నాయి. ఇది భారత సైన్యం కోసం ఒక కీలకమైన అభివృద్ధి. దీని ద్వారా ఆర్మీకి గగన మార్గంలో దాడులకు, పటిష్టమైన మద్దతుగా అపాచీలు ఉపయోగపడతాయి. జూలై 21న ఆ హెలికాప్టర్‌లు మన దేశానికి చేరుకోనున్నాయి.ఆ హెలికాప్టర్‌ల కోసం భారత్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. అనివార్య కారణాలవల్ల వాటి డెలివరీ ఆలస్యమైంది. ఆ హెలికాప్టర్‌లను శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు.

Apache Helicopters : అమెరికా నుంచి భారత్ కు అపాచీ హెలికాప్టర్ల డెలివరీ!

తొలి అపాచీ స్క్వాడ్రన్‌

అమెరికా నుంచి కొత్తగా వస్తున్న ఆ మూడు ఆపాచీ హెలికాప్టర్‌ల (Apache Helicopters)ను పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు భారత రక్షణ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. ఈ AH-64E అటాక్‌ హెలికాప్టర్‌లు భారత వాయుసేనకు చెందిన హిండన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ కానున్నాయి. ఇండియన్‌ ఆర్మీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తొలి అపాచీ స్క్వాడ్రన్‌ను నెలకొల్పిన 15 నెలల తర్వాత ఈ హెలికాప్టర్‌లు (Apache Helicopters)భారత్‌కు వస్తున్నాయి. సప్లయ్‌ చైన్‌లో అంతరాయాలు, అంతర్జాతీయంగా జియోపొలిటికల్‌ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఈ అపాచీ హెలికాప్టర్‌లు భారత్‌కు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో రెండు స్క్వాడ్రన్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఒకటి పఠాన్‌కోట్‌లో, మరొకటి జోర్హాట్‌లో పొజిషన్‌లో ఉన్నాయి.

కాగా, ఇప్పటికే 2015లో అమెరికా ప్రభుత్వంతో, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్‌కు డెలివరీ చేసింది. అదే ఏడాది చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్‌ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఆ 6 హెలికాప్టర్‌లకుగాను ఒప్పందంలో భాగంగా తొలి విడత మూడు హెలికాప్టర్‌లు 2024 మే, జూన్‌ నెలల్లో భారత్‌కు రావాల్సి ఉంది. కానీ పైన పేర్కొన్న కారణాల రీత్యా వాటి రాక ఆలస్యమైంది.

భారతదేశంలో ఎన్ని అపాచీలు ఉన్నాయి?

2015 లో సంతకం చేసిన ప్రత్యేక ఆర్డర్‌లో భాగంగా భారత వైమానిక దళం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను చేర్చుకుంది, అయితే భారత సైన్యం తన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ అధునాతన దాడి హెలికాప్టర్ల కోసం వేచి ఉంది.

అపాచీ హెలికాప్టర్ కనిపెట్టింది ఎవరు?

AH-64 అపాచీ అనేది దాడి హెలికాప్టర్, ఇది మొదట 1975లో ఎగిరింది మరియు 1984 నుండి ఉత్పత్తి చేయబడుతోంది. దీనిని హ్యూస్ హెలికాప్టర్స్ రూపొందించింది, కానీ అది తరువాత మెక్‌డొన్నెల్ డగ్లస్ అయింది, తరువాత ఇది బోయింగ్‌గా మారింది. సైనికులకు సహాయం చేయడానికి నేలపై ఉన్న లక్ష్యాలను దాడి చేయడానికి ఇది రూపొందించబడింది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన హెలికాప్టర్ ఏది?

AD 64-D అపాచీ అటాక్ హెలికాప్టర్ . అపాచీ అనేది 1984లో US సైన్యంతో సేవలోకి ప్రవేశించిన జంట ఇంజిన్ల ఆర్మీ అటాక్ హెలికాప్టర్. యుద్ధంలో అధిక మనుగడ కోసం రూపొందించబడిన AD-64D అపాచీ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన, మనుగడ సాగించగల, మోహరించదగిన మరియు నిర్వహించదగిన బహుళ-మిషన్ హెలికాప్టర్.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Telsa: భారత్‌లో టెస్లా వై మోడల్ కారుపై రూ.29 లక్షల పన్ను

Apache Delivery Apache Helicopters Boeing AH-64E Breaking News India Army latest news Telugu News US-India Defense

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.