AP: అమెరికా సుంకాల తగ్గింపుతో ఆక్వారంగానికి మేలు

Read Time:  1 min
The reduction in US tariffs will benefit the aquaculture sector.
The reduction in US tariffs will benefit the aquaculture sector.
FONT SIZE
GET APP

రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతి దారులకు భారీ లాభం మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింబరావు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని ఎరువు పరులకు సుతారంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. గతంలో 25 శాతం టారిఫ్ ఆవనంగా శిక్షాత్మక టారిఫ్ లతో కలిపి మొత్తం 50-58 శాతం వరకు టారిఫ్ భారం పడటంతో, 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో అమెరికాకు భారతదేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులు పరిమాణంలో సుమారు 15 శాతం తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నలకు, విలువలో 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయాయని గుర్తు వేశాడు.

Read also: Andhra Pradesh: నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

The reduction in US tariffs will benefit the aquaculture sector.

The reduction in US tariffs will benefit the aquaculture sector.

ఈ అమెరికాకు ప్రధానంగా ఎగుమతి అయ్యే డిజైన్ ప్రిసప్ ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా ప్రభావితమైండన్నారు. టారిఫు 18 శాతానికి తగ్గించడంతో అమెరికా మార్కెట్లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ సామర్థం గణనీయంగా మెరుగుపడిందని, నిలిచిపోయిన కొత్త ఎగుమతి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతూ, బాండెడ్ గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును విడుదల చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే నెలల్లో అమెరికాకు (America) సముద్ర ఆహార ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరగే అవకాశం, 365 26 రెండో అర్ధ భాగం లో ఎగుమతులు టారిఫిక్కు ముందు ఉన్నస్థాయికి చేరుకునే 2026 అవకాశముందని చెప్పారు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలోని లాభ మార్జిన్లు కూడా మెరుగవుతాయని, అధిక టారిఫ్ కాలంలో 5-5.5 శాతానికి తగ్గిన ప్రాసెసర్ల మార్జిన్లు టారిఫ్ తగ్గింపు అనంతరం తిరిగి 7-8 శాతం స్థాయికి చేరే అవకాశముందన్నారు.

టారిఫ్ భారంతో పడిపోయిన ఎగుమతులు

కేంద్ర బడ్జెట్ సముద్ర ఆహార ప్రాసెసింగ్ కు అవసరమైన ఇన్ ఫుట్ కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందించను న్నాయని తెలిపారు. అమెరికా మార్కెట్ పునరు ద్ధరణతో పాటు యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు భారతీయ సముద్ర ఆహార ఎగుమతులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని, 2025-26 ప్రారంభం లో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా సుమారు 57 శాతానికి చేరడం మార్కెట్ విభిన్నీకరణకు నిదర్శనమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి దీర్ఘకాల లాభాలు

దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని, ఎగుమతుల పునరుద్ధరణతో రాష్ట్రంలోని మత్స్య, ఆక్వా రంగాల్లో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపు కూడా మెరుగుపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అంచనాల ప్రకారం 2025-26 లో దేశవ్యాప్తంగా మొత్తం సముద్ర ఆహార ఎగుమతులు 14-15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశముందని పేర్కొంటూ, మొత్తం మీద అమెరికా టారిఫ్ను 18 శాతానికి తగ్గించడం భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల పునరుద్ధరణకు, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం స్థిరమైన అభివృద్ధికి కీలకమని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.