ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్(AP) తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో ఆయన అమెరికా, కెనడా దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ముఖ్య లక్ష్యం. ఆయనతోపాటు, ఈ పర్యటనలో ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా మరియు అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొననున్నారు.
Read aslo: ఇద్దరు కూతుళ్లతో మహిళ అదృశ్యం: కుటుంబసభ్యల ఆందోళన
పర్యటన ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యం
గతంలో(AP) నారా లోకేశ్(Nara Lokesh) విదేశీ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో సఫలమైనవి. ముఖ్యంగా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో జరిగిన పర్యటనలు మంచి స్పందన లభించినవి. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్యంతో జరిగిన సదస్సు కూడా దీనికి అద్భుత నిదర్శనం. తాజా పర్యటన ద్వారా కొత్త పెట్టుబడులు రాష్ట్రం దిశగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: