📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran-Israel : అమెరికా నగరాల్లో యుద్దానికి వ్యతిరేకంగా నిరసనలు

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Iran-Israel) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా(America) సైతం యుద్ధరంగంలోకి దిగింది. ఇక అమెరికాలోని పెద్ద నగరాలలో ముఖ్యంగా సాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco), వాషింగ్టన్ డీ.సీ. వంటి చోట్ల ఇరాన్‌కు మద్దతుగా భారీ ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.

Iran-Israel : అమెరికా నగరాల్లో యుద్దానికి వ్యతిరేకంగా నిరసనలు

భీకర పోరు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Iran-Israel) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం యుద్ధరంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. . ఇరాన్‌ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్‌ బస్టర్‌ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. ఇక ఇరాన్‌పై అమెరికా దాడుల అనంతరం పెద్ద ఎత్తున ఆందోలనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడం మానుకోవాలి
అమెరికాలోని ప్రధాన నగరాల్లో (US cities) ఇరాన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. ఇరాన్‌కు అనుకూలంగా ప్రదర్శన చేపట్టారు. ‘ఇరాన్‌పై దాడులు ఆపండి’, ‘ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ యుద్దం వద్దు’ అనే నినాదాలతో పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మేరకు యుద్ధ వ్యతిరేక నినాదాలు (anti-war protests) చేశారు. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో వందలాది మంది నిరసన కారులు యుద్దానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ వెలుపల, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శనకారులు గుమిగూడారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడం మానుకోవాలని, ఇరాన్‌తో సంఘర్షణలో జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేశారు.
‘మిడ్‌నైట్‌ హ్యామర్‌’
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్‌ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్‌ బస్టర్‌ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్‌ ‘మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు, ఏడు బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో దాడి చేసింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించిన స్టెల్త్‌ బాంబర్లు రెండు అణు కేంద్రాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులను జారవిడువగా, మరో అణు కేంద్రంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. బంకర్‌ బస్టర్‌ బాంబులు భూగర్భంలోని బంకర్లలోకి చొచ్చుకుపోయి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి.
నగరాల్లో హైఅలర్ట్‌
ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగా ముఖ్యమైన అన్ని కేంద్రాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్టు న్యూయార్క్‌ పోలీస్‌ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Newyork: ఇరాన్‌పై దాడుల వేళ న్యూయార్క్‌లో ఆందోళనలు

#AntiWar #CodePink #HandsOffIran #NoWarOnIran #USIranProtests Anti-war protests Breaking News in Telugu Google news Google News in Telugu in American cities Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.