📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest Telugu News: Pak: ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌.. పలువురు మృతి

Author Icon By Vanipushpa
Updated: October 13, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లాహోర్‌లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌ చేస్తున్న టీఎల్‌పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెహ్రీక్ ఈ ల‌బ్బాయిక్ పాకిస్థాన్ మ‌ద్దతుదారుల‌పై పాక్ భ‌ద్రతాద‌ళాలు విరుచుకుప‌డ్డాయి. ఇస్లామాబాద్ వైపు దూసుకువ‌స్తున్న ఆందోళ‌న‌కారుల్ని అడ్డుకున్నారు. ఆందోళనకారులపైకి పాకిస్థాన్ పోలీసుల కాల్పులు జిరిపారు.ఆ ఘ‌ర్షణ‌ల్లో ఓ ఆఫీస‌ర్‌తో పాటు అనేక మంది నిర‌స‌న‌కారులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. కాల్పుల్లో TLP చీఫ్‌ సహా పలువురు ఆందోళనకారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

భ‌ద్రతా ద‌ళాల‌పై ఆందోళ‌న‌కారులు ఫైరింగ్

లాహోర్ స‌మీపంలో ఈ ఆందోళ‌న జ‌రిగింది. పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వార్ మాట్లాడుతూ.. భ‌ద్రతా ద‌ళాల‌పై ఆందోళ‌న‌కారులు ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు పేర్కొన్నారు. దీంతో ఓ ఆఫీస‌ర్ మృతిచెందిన‌ట్లు చెప్పారు. అయితే ఎంత మంది నిర‌స‌న‌కారులు ప్రాణాలు కోల్పోయారో చెప్పలేదు. టీఎల్‌పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా ఆ కాల్పుల్లో గాయ‌ప‌డటం లేదా మరణించిన‌ట్లు తెలుస్తోంది. అత‌నికి బుల్లెట్లు దిగిన‌ట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అత‌ని ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉందని ప్రచారం సాగతోంది. ముర్దికే వ‌ద్ద జ‌రిగిన కాల్పుల్లో ఓ స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. టీఎల్‌పీ పార్టీ శుక్రవారం త‌మ ఆందోళ‌న‌లు మొద‌లుపెట్టింది. ఇస్లామాబాద్‌లో ఉన్న అమెరికా ఎంబ‌సీ ముందు గాజా, పాల‌స్తీనాకు అనుకూలంగా ప్రద‌ర్శన చేప‌ట్టాల‌ని భావించింది.

Read Also: Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..

ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌.. పలువురు మృతి

సరిహద్దుల్లో ఘర్షణలు..58 మంది సైనికులు మృతి ?

మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో, ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో ఆదివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, అంతకుముందు జరిగిన ప్రతీకార దాడుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని కాబూల్ ప్రకటించింది. దీంతో సరిహద్దు క్రాసింగ్‌లను పాకిస్తాన్ మూసివేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండిస్తూ, ఆ దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.

పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న రెండు ప్రధాన సరిహద్దు మూసివేత

దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న రెండు ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌లైన తోర్ఖం, చమన్‌లను ఆదివారం మూసివేశారు. ఇతర చిన్న క్రాసింగ్‌లను కూడా నిలిపివేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు వైపులా ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘన్ దళాలకు ఐదుగురు పాకిస్థాన్ సైనికులు లొంగిపోయారని కూడా టోలో న్యూస్ వివరించింది. రెండు దేశాల మీడియా సంస్థలు కూడా పరస్పరం ఎదుటి పక్షానికి భారీ నష్టం వాటిల్లిందని ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. పాకిస్థాన్ మీడియా సంస్థలు అనేక ఆఫ్ఘన్ పోస్టులు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ సైనికులు మరణించారని పేర్కొనగా, ఆఫ్ఘన్ వర్గాలు పాకిస్థాన్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నాయి.

పాకిస్తానీ సంస్కృతి ఎలా ఉంటుంది?
పాకిస్తానీ సంస్కృతి. పాకిస్తానీ సంస్కృతి | డాని మాలిక్ | మీడియం
పాకిస్తానీ సంస్కృతి అనేది ఇస్లామిక్, టర్కో-పర్షియన్, అరబ్ మరియు భారతీయ ప్రభావాల యొక్క విభిన్న సమ్మేళనం, బలమైన కుటుంబ బంధాలు మరియు సామూహికత దాని ప్రధాన అంశం.

పాకిస్తాన్ ధనిక దేశమా కాదా?
కాదు, పాకిస్తాన్ ధనిక దేశం కాదు; దీనిని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మరియు తక్కువ-మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశంగా వర్గీకరించారు, దాని జనాభాలో ఎక్కువ భాగం పేదరికంలో నివసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/international/japan-permanent-residency-pr-fees-reduced-to-5000-rupees/563965/

Anti-Israel Protest Israel Gaza Conflict Pakistan Protests protest deaths Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.