📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Dario Amodei AI: వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: February 12, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు కోడింగ్‌ నేర్చుకున్నవాళ్ల భవిష్యత్తుకు ఢోకా లేదనుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే రాబోయే తరాలను శాశిస్తాయని భావించారు. నిజానికి సాఫ్ట్‌వేర్‌ పునాదులు వేసుకోవడానికి.. అభివృద్ధి చెందడానికి దశాబ్దాలకుపైగా పట్టింది. అయితే.. ఈ మధ్యలో పుట్టుకొచ్చి.. నడవటమే కాదు.. రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఏఐ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిదంటే.. ఒక విచిత్రం తెరపైకి వచ్చి.. అది అర్థం చేసుకునేలోపే మరో వంద విచిత్రాలను ఏఐ చేసిపారేస్తున్నది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగం ఇక కొన్నాళ్లలో మూటా ముల్లె సర్దుకుని కొత్త దారిలో నడవాల్సిందేనన్న అభిప్రాయాలు స్థిరపడుతున్న వేళ.. ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను అతలాకుతలం చేసిపారేస్తున్నాయి. ఆరు నెలలు.. మహా అయితే ఏడాదిలోపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల అవసరం లేకపోవచ్చు.. అంటూ ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడి (Dario Amodei) చెప్పిన మాటలు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ.. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని సమూలంగా మార్చివేయనున్నదనేది ఆయన భావన.

Read Also: Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి 

Dario Amodei AI: వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

అతి త్వరలోనే డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌

ఇప్పటి దాకా ప్రోగ్రామర్లకు సహాయం చేసిన ఏఐ టూల్స్‌.. సహకారం అందించడం కాకుండా.. స్వయంగా కోడ్‌ రాసేస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. బగ్స్‌ ఫిక్స్‌ చేయడంతోపాటు.. పూర్తిస్థాయిలో అప్లికేషన్లను కూడా అవే తయారు చేస్తున్నాయని అమోడి అన్నారు. దానర్థం.. మనిషి కోడ్‌ రాయడం కాదు.. ఏఐ రాసిన కోడ్‌ను మనిషి చెక్‌ చేసే దశకు వచ్చేశామని ఆయన వ్యాఖ్యానించారు. అమోడి సీఈవోగా వ్యవహరిస్తున్న అంథ్రోపిక్‌ సంస్థలో ఇంజినీర్లు Claude వంటి ఏఐ మోడళ్లతోనే అధికభాగం కోడ్‌ జనరేట్‌ చేయిస్తున్నారు. వాటిని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు రివ్యూ చేసి.. ఫైన్‌ట్యూన్‌ చేస్తున్నారు. అతి త్వరలోనే మొత్తం డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌ చేయగలదని డారియో అమోడి అంచనా వేస్తున్నారు.

వెంటనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మాయం

అమోడి చేసిన వ్యాఖ్యలు టెక్‌ రంగంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కొంతమంది అమోడి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. ఆ ప్రమాదం మన వాకిట్లోకి వచ్చేయలేదని అంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వెంటనే మాయమైపోతాయని తాను భావించడం లేదన్న జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వేంబు.. అదే సమయంలో డారియో అమోడి హెచ్చరికలను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యాధునిక ఏఐ టూల్స్‌ తయారు చేసిన వ్యక్తి మాటలని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవుననే అంటున్నారు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు. ఏఐ అత్యంత వేగంగా కోడ్‌ రాయగలదని, కానీ.. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని చెబుతున్నారు. వాస్తవిక ప్రపంచ సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏఐకి ఇంకా చాలా పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పెద్ద పెద్ద సిస్టమ్‌ల బాధ్యతను ఏఐ తీసుకోవడం ఇంకా కష్టమేనని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AI expansion AI Regulation AI Safety Anthropic CEO artificial intelligence news generative AI tech industry updates Technology Leadership Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.