📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Anthony: 62 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిని ఆస్ట్రేలియా ప్రధాని

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. 62 ఏళ్ల వయసులో ఆయన తన ప్రేయసి జోడీ హేడన్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. పదవిలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న తొలి ఆస్ట్రేలియా (Australia) నాయకుడిగా అల్బనీస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. కాన్‌బెర్రాలోని అధికారిక నివాసం ద లాడ్జ్ ప్రాంగణంలో అతి సన్నిహితులతో జరిగిన ఈ వేడుక చాలా సింపుల్‌, కానీ హృదయపూర్వకంగా సాగింది.

Read also: Floods: భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం.. 442 మంది మృతి

Australian Prime Minister marries girlfriend

వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వారి పెంపుడు కుక్క టోటో. రింగ్ బేరర్‌గా వ్యవహరించి అందరి అభిమానాన్ని పొందింది. గత ఏడాది వాలెంటైన్స్ డే నాడు జోడీకి ప్రపోజ్ చేసిన అల్బనీస్, ఈ ఏడాది అధికారికంగా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తెల్లటి గౌనులో మెరిసిన జోడీ, బో-టైతో క్లాసిక్ లుక్‌లో కనిపించిన అల్బనీస్ వారి సింపుల్ వేడుకను మరింత శోభాయమానంగా మార్చారు.

వివాహం అనంతరం దంపతులు భావోద్వేగంగా స్పందిస్తూ,
“మా ప్రేమను, మా భవిష్యత్తును మనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల మధ్య పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.

విడాకుల తర్వాత కొత్త ఆరంభం

అల్బనీస్ మొదటి భార్యతో 2019లో విడిపోయారు. వారికి నాథన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత జీవితం సాదాసీదాగా సాగుతుండగా, ఐదేళ్ల క్రితమే మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో జోడీ హేడన్‌తో పరిచయం పెరిగింది. కాలక్రమేణా ఆ పరిచయం ప్రేమగా మారింది. 2024 వాలెంటైన్స్ డే నాడు “జీవితాంతం నాతో ఉండాలా?” అని అల్బనీస్ ప్రశ్నించగా జోడీ అంగీకరించడం వారి ప్రేమకథకు ముద్దు పెట్టినట్టైంది.

మోదీ కూడా అభినందనలు

అల్బనీస్ వివాహానికి పలువురు ప్రపంచ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రెండోసారి ప్రధాని పదవిని దక్కించుకున్న అల్బనీస్, ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నారు. త్వరలోనే ఐదు రోజుల హనీమూన్‌కు వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Australia latest news PM Albanese Telugu News wedding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.