అప్పటివరకు వారంతా బీచ్ లో ఉల్లాసంగా తమ కుటుంబ సభ్యులతో పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఆనందసాగరంలో తేలియాడుతూ కేరింతలాడుతూ గడిపారు. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల మధ్య తమ అనుబంధాలను, ప్రేమను పంచుకుంటూ పండుగ చేసుకుంటూ, ఆ మధురమైన జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని తపించారు. దాదాపు వెయ్యిమంది వరకు యూదులు ఆ బీచ్ లో ఉన్నారు. కానీ ఇంతలో ఎక్కడ నుంచి వచ్చారో ఉగ్రవాదులు ఇద్దరు హఠాత్తుగా వారిపై కాల్పులకు తెగించారు.
Read Also: Zelensky: రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్
కనిపించినవారిని కాల్చేస్తున్నారు.
ఇంతలో ఓ వ్యక్తి ఒకరిని అదుపు చేసేందుకు ప్రయత్నించి, గాయపడ్డాడు. ఆ వ్యక్తి గురించి నేడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది. అతను ఎవరో కాదు అహ్మద్ అల్ అహ్మద్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ లో యూదులను లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అయితే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు. ఓవైపు బుల్లెట్లు దూసుకొస్తున్నా.. ఏమాత్రం వెరవకుండా పోరాడాడు. అతడి తెగింపును యావత్తు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా అహ్మద్ ను హీరో అంటూ కొనియాడిని విషయం విధితమే.
నువ్వు ఆస్ట్రేలియన్ హీరో.. ప్రధాని
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ అల్ అహ్మద్ ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Prime Minister Anthony Albanese) పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నువ్వు ఆస్ట్రేలియన్ హీరో’ అంటూ ప్రశంసించారు. దశాబ్దాల్లో దేశంలో అత్యంత ఘోరమైన తుపాకీ దాడిని ఆపడంలో అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించాడంటూ కొనియాడారు. ఆస్ట్రేలియా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
పండ్లవ్యాపారం ద్వారా జీవనం అహ్మద్ అల్ అహ్మద్ ది సిరియా దేశం. నిత్యం సిరియాలో అంతర్యుద్ధంతో విసిగిపోయిన ఆయన ప్రశాంతంగా జీవితాన్ని గడిపేందుకు ఆస్ట్రేలియాకు వలసి వచ్చాడు. 2022లో ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం బోండి బీచ్ దగ్గర ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అహ్మద్ కు అనేక గాయాలయ్యాయి. ఎడమచేతికి ఒక బుల్లెట్, ఎడమ భుజంపై గాయం అయింది. ప్రస్తుతం ప్రపంచవవ్యాప్తంగా అహ్మద్ కు సహాయ సహకారాలు, మద్దతు లభిస్తోంది. ఈ కాల్పుల్లో 16మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: