అమెరికా (America) లోని మిసిసిపీ రాష్ట్రం (Mississippi State) మళ్లీ కాల్పుల హింసతో దద్దరిల్లింది. లేలాండ్ పట్టణంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపింది. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ (Derrick Simmons) ఈ ఘటనను ధృవీకరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అక్కడ ఫుట్‌బాల్ మ్యాచ్ (football match) నిర్వహించారు..
China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth
మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆ సమయంలో కాల్పులు (firing) చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ (Jackson) నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర మేయర్ జాన్‌లీ (Mayor John Lee) ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: