📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత

Author Icon By Aanusha
Updated: October 28, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, మంగళవారం నుంచి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.

Read Also: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..?

మొత్తం 15.5 లక్షల మంది అమెజాన్ ఉద్యోగులతో (Amazon employees) పోలిస్తే ఈ సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, కంపెనీలోని 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో ఇది దాదాపు 10 శాతానికి సమానం. 2022 చివర్లో 27,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఇదే అతిపెద్ద లేఆఫ్ కావడం గమనార్హం.

అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు.ఈ ఉద్యోగాల కోత ప్రభావం హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ), ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వంటి పలు కీలక విభాగాలపై ఉండే అవకాశం ఉంది.

సోమవారం మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం

ప్రభావిత ఉద్యోగులకు మంగళవారం ఉదయం నుంచి ఈ-మెయిల్స్ (E-mails) ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందితో ఎలా వ్యవహరించాలనే అంశంపై సోమవారం మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.కంపెనీలో అనవసరమైన ప్రక్రియలను తగ్గించేందుకు సీఈఓ ఆండీ జెస్సీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

Amazon

దీనికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరగడం వల్ల పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేస్తూ సిబ్బందిని తగ్గిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో అమలు చేసిన ‘వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలి’ అనే నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలుగుతారని కంపెనీ ఆశించినా,

ఈ భారీ లేఆఫ్స్‌కు ఓ కారణంగా తెలుస్తోంది

అది జరగకపోవడం కూడా ఈ భారీ లేఆఫ్స్‌కు ఓ కారణంగా తెలుస్తోంది.ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, రానున్న పండగల సీజన్ కోసం గిడ్డంగులు, ఇతర అవసరాల నిమిత్తం 2.5 లక్షల మంది తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని అమెజాన్ యోచిస్తోంది.

కాగా, కంపెనీకి అత్యంత లాభదాయకమైన ఏడబ్ల్యూఎస్ విభాగం వృద్ధిరేటు, పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ కంటే వెనుకబడింది. అమెజాన్ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amazon layoffs Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.