📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Anil Boinapalli: తెలంగాణ వాసికి అమెరికాలో అరుదైన గౌరవం

Author Icon By Aanusha
Updated: October 17, 2025 • 9:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ వ్యాపార రంగానికి గర్వకారణంగా నిలిచే మరో ఘన సంఘటన చోటు చేసుకుంది. వర్జీనియాలో స్థిరపడ్డ భారతీయ వ్యాపారవేత్త అనిల్ బోయినపల్లి (Anil Boyinapalli) 2025 లీడర్‌షిప్ గ్లోబీ అవార్డు (2025 Leadership Globee Award) కు ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో క్రమంగా ఎదిగి, సాంకేతిక ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ, ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆయనకు ఈ అంతర్జాతీయ అవార్డు దక్కడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అయ్యింది.

Read Also: Earthquake: ఆఫ్ఘాన్ నేల మరోసారి కదిలింది

అనిల్ బోయినపల్లి (Anil Boyinapalli) 2008లో అమెరికా వర్జీనియాలో స్కై సొల్యూషన్స్‌ (Sky Solutions) అనే సాంకేతిక సంస్థను స్థాపించారు. ఆ సంస్థని తానే CEOగా నడిపిస్తుండగా, ప్రస్తుతం అమెరికా సహా అనేక దేశాలలో కార్యకలాపాలు విస్తరించాయి. ఈ సంస్థ AI (Artificial Intelligence), సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ వంటి విభిన్న సాంకేతిక సేవలను అందిస్తూ, వ్యాపారాల కోసం వినూత్న పరిష్కారాలను ప్రవేశపెట్టింది.

వృత్తిపరమైన నాణ్యతా ప్రమాణాలు, కస్టమర్-ఫ్రెండ్లీ విధానాలు అనిల్ బోయినపల్లి నాయకత్వం వలన సాధ్యమయ్యాయి.గ్లోబీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. “గ్లోబీ అవార్డ్స్‌ పూర్తిగా ప్రతిభ ఆధారంగా అందజేస్తారు. విజేతల ఎంపికను స్వతంత్ర పరిశ్రమ నిపుణుల మూల్యాంకనంతో నిర్ణయిస్తారు.” అని తెలిపింది.అనిల్ బోయినపల్లి వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

Anil Boinapalli

అనంతరం సీఎన్‌ఎస్‌ఐ (CNSI) సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసి, హెల్త్‌కేర్‌ రంగంలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఫెన్నీ మే (Fannie Mae), హారిస్ కార్పొరేషన్‌ వంటి ప్రముఖ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పని చేశారు. సాంకేతికతలో నైపుణ్యం, వ్యాపారంలో దూరదృష్టి కలగలిపిన అనిల్‌ బోయినపల్లి సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు, తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

2025 Leadership Globee Award Anil Boyinapalli latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.