📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Anderson- Tendulkar: తన పేరుతో ట్రోఫీ నిర్వహించడంపై జేమ్స్ అండర్సన్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్, తన 22 సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కి 2024లో ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఈ బౌలర్, 40 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతని విశిష్ట సేవలకు గుర్తింపుగా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ (Test series) ను అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా పునర్నామకరించింది.ఈ ట్రోఫీలో భారత క్రికెట్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పేరుతో పాటు తన పేరును చూడటం అండర్సన్‌కు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజం పక్కన నా పేరు ఉండటం, నా జీవితంలో గర్వించదగిన క్షణం. నేను అతని స్థాయిలో లేనప్పటికీ, మా పేర్లను కలిపి ట్రోఫీకి పెట్టడం గొప్ప గౌరవం,” అని అన్నారు.

ప్రతిష్టాత్మక పోటీ

అండర్సన్ తన కెరీర్‌లో 188 టెస్ట్ మ్యాచ్‌లలో 704 వికెట్లు సాధించాడు. ఇది ఫాస్ట్ బౌలర్‌గా ఇప్పటివరకు అత్యధిక వికెట్లు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆయన 149 వికెట్లు తీసి తన ప్రావీణ్యాన్ని మరోసారి నిరూపించాడు. సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) ను కూడా ఆయన కెరీర్‌లో పలు సందర్భాల్లో ఔట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇది వారి మధ్య ప్రతిష్టాత్మక పోటీని గుర్తు చేస్తుంది.ఈ ట్రోఫీకి శ్రీకారం చుట్టిన తొలి సిరీస్ 2025లో జరగగా, ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ జూలై 23న మాంచెస్టర్‌లో జరగనుంది. భారత జట్టు సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రోఫీ ఆవిష్కరణ అండర్సన్ రిటైర్మెంట్ తర్వాత మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

ప‌టౌడీ ట్రోఫీ

భార‌త్, ఇంగ్లండ్‌ల మ‌ధ్య తొలి టెస్టు సిరీస్‌కు 2007లో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఇరుదేశాల బోర్డులు ఇంగ్లండ్‌లో జ‌రుగ‌బోయే సిరీస్‌ను మ‌న్సూర్ అలీ ఖాన్ ప‌టౌడీ పేరుతో నిర్వహించాల‌ని నిర్ణయించాయి. అప్పటినుంచి 2024 వ‌రకూ ప‌టౌడీ పేరుతోనే ట్రోఫీని జ‌రిపారు. అయితే నిరుడు జేమ్స్ అండ‌ర్సన్ (James Anderson) వీడ్కోలు ప‌ల‌క‌డంతో అత‌డిని గౌర‌వించాల‌నుకుంది ఈసీబీ.అందుకే ప‌టౌడీ ట్రోఫీకి మంగ‌ళం పాడి భార‌త లెజెండ్ స‌చిన్ టెండూల్కర్ పేరును జ‌త‌చేసింది. ఈసీబీ ప్రతిపాదనపై వివాదం చెలరేగినా చివరకు పటౌడీ పేరును ట్రోఫీలో కొనసాగిస్తామని మాట ఇచ్చింది ఈసీబీ. విన్నింగ్ కెప్టెన్‌కు పటౌడీ మెడల్ (Pataudi Medal) ను కానుక‌గా ఇస్తామని చెప్పి సమస్యకు ముగింపు పలికింది.

జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ వేగం ఎంత ఉంటుంది?

జేమ్స్ ఆండర్సన్ ఒక స్వింగ్ బౌలర్‌గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్ లెజెండరీ పేసర్. అతని బౌలింగ్ ప్రధానంగా లైన్, లెంగ్త్, స్వింగ్‌పై ఆధారపడుతుంది. వయసు 40 దాటి ఉన్నప్పటికీ, భారత్‌తో జరిగిన తాజా టెస్ట్ సిరీస్‌లో అతను గరిష్టంగా గంటకు 137–139 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు.

జేమ్స్ ఆండర్సన్ జీతం?

ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆండర్సన్‌కు వార్షిక జీతం £800,000 చెల్లిస్తుంది, ఇది అతను తన కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ జట్టుకు అతని విలువను ప్రతిబింబిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Koneru Hampi: FIDE మహిళల ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

Anderson Tendulkar Trophy Breaking News India vs England Test Series 2024 James Anderson farewell James Anderson retirement latest news Sachin Anderson Trophy Sachin Tendulkar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.