Richard Mille Watch: ప్రపంచ ఫుట్‌బాల్‌లో దిగ్గజంగా గుర్తింపు పొందిన లియోనెల్ మెస్సీ(Messi)కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అదే విధంగా రిలయన్స్ గ్రూప్ వారసుడు, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా అందరికీ సుపరిచితుడే. ఇటీవల మెస్సీ భారత పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ తన ప్రతిష్టాత్మక వంటారా (Vantara) ప్రాజెక్టును చూపించారు. ఈ సందర్శన సందర్భంగా మెస్సీకి అనంత్ ఒక అత్యంత అరుదైన లగ్జరీ బహుమతిని అందించగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read also: Lionel Messi: మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు
అనంత్ అంబానీ మెస్సీకి బహుమతిగా ఇచ్చింది ఓ అల్ట్రా రేర్ లగ్జరీ వాచ్. ఈ వాచ్ పేరు ఆర్ఎం 003-వి2 జీఎంటీ టౌర్బిల్న్(RM 003-V2 GMT Tourbillon – Asia Edition). ఇది ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ వాచ్ బ్రాండ్ రిచర్డ్ మిల్లె తయారు చేసిన అత్యంత ప్రత్యేక మోడల్. ఈ వాచ్ ధర సుమారు రూ. 10.91 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అసలు విశేషం ఏమిటంటే… ఈ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 వాచీలే తయారు చేశారు. అంటే, ఈ అరుదైన వాచ్‌ను ధరించే అతి కొద్ది మంది జాబితాలో ఇప్పుడు మెస్సీ కూడా చేరినట్టే.
ఈ ఖరీదైన వాచ్‌కు బ్లాక్ కార్బన్ కేసింగ్ ఉండగా, లోపల ఉన్న మెకానిజం మొత్తం స్పష్టంగా కనిపించేలా స్కెలెటోనిస్డ్ డయల్(Skeletonized dial) డిజైన్ ఉంది. ఇందులో టౌర్బిల్న్ మరియు జీఎంటీ ఫంక్షన్ వంటి అత్యంత ఆధునిక, క్లిష్టమైన మెకానికల్ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బరువు, హైటెక్ డిజైన్, స్టైలిష్ లుక్ ఈ వాచ్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఇదిలా ఉండగా, మెస్సీకి కోట్ల విలువైన వాచ్‌ను గిఫ్ట్ చేసిన అనంత్ అంబానీ కూడా ఆ సమయంలో తాను ధరించిన వాచ్‌తో ఆకర్షణగా మారారు. ఆయన చేతిపై కనిపించినది RM 056 సాప్ఫిరే టౌర్బిల్న్ వాచ్. దీని విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 45.59 కోట్లు. ఈ ఘటన అంబానీ కుటుంబానికి లగ్జరీ వాచీలపై ఉన్న ప్రత్యేక ఆసక్తిని మరోసారి చాటిచెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: