📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Amritsar: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ..అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్

Author Icon By Sharanya
Updated: May 11, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు సంతరించుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ అలెర్ట్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

ప్రజల కు సూచనలు

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్‌కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

ప్రజల అవసరాల దృష్ట్యా విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. అయితే, దీనిని చూసి భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని భావించకూడదని, రెడ్ అలెర్ట్ యధాతధంగా కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. అధికారులు ఇచ్చే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తెల్లవారుజామునే సూచనలు

అంతకుముందు, తెల్లవారుజామున 4:39 గంటలకు కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమానిత కార్యకలాపాలు, డ్రోన్ సంచారాలపై కఠినంగా స్పందిస్తోంది. పాకిస్థాన్ వైపు నుండి వచ్చిన కొన్ని డ్రోన్లను గుర్తించి అడ్డుకున్నట్లు రక్షణ వర్గాలు తెలియజేశాయి.

Read also: Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

#AmritsarNews #AmritsarRedAlert #BorderAlert #IndiaPakistanTensions #MilitaryAlert #PunjabSecurity Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.