📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Amnesty: బలూచిస్థాన్‌ పై పాకిస్థాన్ ఆరోపణలు.. మండిపడ్డ ఆమ్నెస్టీ

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉద్యమకారుల అణిచివేతకు ఉపయోగిస్తోందని ఆరోపణ
ప్రత్యేక దేశం కోసం పోరాడే వారి హక్కులను కాలరాయొద్దన్న ఆమ్నెస్టీ(Amnesty)
బలూచిస్థాన్ ప్రజలు ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే, పాకిస్థాన్ వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టాలను పాక్ దుర్వినియోగం చేస్తూ, బలూచ్ ఉద్యమకారుల అణిచివేతకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టం కింద బలూచ్‌కు చెందిన 32 మందిని పాక్ తన వాచ్ లిస్ట్‌లో చేర్చడాన్ని ఆమ్నెస్టీ తప్పుబట్టింది.

Read Also: United Nations : ప్రమాదంలో ఐక్యరాజ్యసమితి అస్తిత్వం

Amnesty

ప్రాథమిక హక్కులును భంగం చేస్తున్న పాక్

ప్రత్యేక దేశం కోసం పోరాడే వారిని వాచ్ లిస్ట్‌లో చేర్చడం సరికాదని, ఇది వారి హక్కులను పూర్తిగా కాలరాయడమేనని ఆమ్నెస్టీ దక్షిణాసియా రీజినల్ డైరెక్టర్ బాబూ రామ్ అన్నారు. పాక్ చర్యల వల్ల స్వేచ్ఛ, గోప్యత, ఉద్యమానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు. పాక్ తన వాచ్ లిస్ట్‌లో మహిళలను కూడా చేర్చి హద్దులు దాటిందని విమర్శించారు. దీనివల్ల వాచ్ లిస్ట్‌లో ఉన్నవారు కఠిన పర్యవేక్షణ, ప్రయాణ ఆంక్షలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బలూచ్ ఉద్యమకారులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం కూడా వారికి లేకుండా పోయిందని ఆయన అన్నారు.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి?
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది మానవ హక్కులను పరిరక్షించడానికి మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి ప్రచారం చేసే ప్రపంచవ్యాప్త ప్రభుత్వేతర సంస్థ.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో ఎన్ని దేశాలు ఉన్నాయి?
21వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంస్థ 50 కంటే ఎక్కువ దేశాలలో జాతీయ విభాగాలు లేదా కార్యాలయాలను మరియు 150 కంటే ఎక్కువ దేశాలు మరియు భూభాగాలలో దాదాపు మూడు మిలియన్ల మంది వ్యక్తిగత సభ్యులు, దాతలు మరియు అనుబంధ కార్యకర్తలను కలిగి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Allegations Amnesty International Balochistan Human Rights International Relations News Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.