📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Amina Begum: దుబాయ్ వెళ్లిన పాతబస్తీ మహిళ డ్రగ్స్ కేసులో అరెస్టు

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : దుబాయ్ లో బ్యూటీ పార్లర్ ఉద్యోగం కోసం వెళ్లిన పాత బస్తీలోని కిషన్ బాగ్ చెందిన ఓ మహిళ అక్కడ డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలు పాలయ్యింది. అయితే తమ కూతురు అమాయకురాలని, ఆమెకు ఏ పాపం తెలియదని, ఎవరో అన్యాయంగా ఇందులో ఇరికించారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. వివరాలు ఇలావున్నాయి. కిషన్బాగ్కు చెందిన అమీనా బేగం (24) వివాహిత. ఆమె భర్త ఆయూబ్ ఖాన్ (Ayub Khan) ప్రైవేటు ఉద్యోగి, వీరికి ఐదేళ్ల కుమారుడు వున్నాడు. పాతబస్తీలోని ఓ ఏజెంట్ ద్వారా మే 18వ తేదీన దుబాయ్లో బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం నిమిత్తం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కు వెళ్లింది.

కుమార్తె దుబాయ్ కు వెళ్లే సమయంలో

అయితే ఆమీనా బేగం దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే ఆమె వద్ద వున్న బ్యాగ్ను అక్కడి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఒక బ్యాగులో నిషిద్ధ మాదకద్రవ్యాలు వుండడంతో పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం దుబాయ్ లోని అబూదబి జైల్లో వుంది. అయితే ఈ ఘటనపై ఆమీనా బేగం (Amina Begum) తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె దుబాయ్ కు వెళ్లే సమయంలో హైదరాబాద్ లో ఎవరో ఒక బ్యాగ్ ఇచ్చి దీనిని దుబా ని తమ మనుషులకు ఇవ్వాలని కోరారని, ఇందులో మాదకద్రవ్యాలు వున్న విషయం తమ కుమార్తెకు తెలియదని వారు తెలిపారు. తమ కుమార్తెకు తెలియకుండా జరిగిన ఈ నేరం లో ఆమె ఇరుక్కుని జైలు పాలైందని వారు ఆవేదన చెందారు.

పాత బస్తీలోని బహదూర్పురా పోలీసు అధికారులతో

ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని తమ కుమార్తెను విడిపించి భారత్ కు తిరిగి తీసుకురావాలని వారు వేడుకున్నారు. తమ మనవడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని
వారు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ను ప్రత్యేకంగా వేడుకు న్నారు. ఈ కేసులో అమీనా బేగంను దుబాయ్ కు పంపిన ఏజెంట్ను విచారిస్తే అన్ని విషయాలు తెలు స్తాయని వారు తెలిపారు. కాగా దీనిపై పాత బస్తీలోని బహదూర్పురా పోలీసు అధికారులతో మాట్లాడగా ఈ విషయమై తమకు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దుబాయ్ దేశమా లేదా నగరమా?

దుబాయ్ ఒక నగరం మరియు ఒక ఎమిరేట్ (Emirate) కూడా. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో భాగంగా ఉంది.

దుబాయ్ ఎందుకు ప్రసిద్ధి చెందింది?

దుబాయ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ఇది ప్రధానంగా ఆధునిక శిల్ప కళ, భారీ షాపింగ్ మాల్స్, ఆభరణాల కొనుగోళ్లు, నైట్ లైఫ్, పర్యాటక ఆకర్షణలతో ప్రసిద్ధి పొందింది.

Read Hindi News : hindi.vaartha.com

Read also : MLA Medipalli Satyam: బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే: వారిది ఫెవికాల్ బంధం

Amina Begum Ayub Khan beauty parlour Breaking News Drug Case Dubai job hyderabad Indian arrested abroad Kishan Bagh latest news Telugu News woman arrested in Dubai

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.