📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America Attack on Iran : ఇరాన్ పై అమెరికా దాడులు

Author Icon By Sudheer
Updated: November 3, 2026 • 9:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

America Attack on Iran : ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఖేష్క్ ద్వీపంలో పరిమిత స్థాయిలో మిలిటరీ దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అలాగే ఖేర్మ్‌తో పాటు బందర్ లెంగే సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన రాడార్ డిటెక్టర్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దాడుల పూర్తి వివరాలు, నష్టానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలను పెంచే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : గూఢచర్యంలో మాదే పైచేయి: ట్రంప్!

America Attack On Iran

ట్రంప్ ప్రకటన తర్వాతే సైనిక చర్య.. పెరుగుతున్న ఉత్కంఠ

మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడుల వార్తలు వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలకు అవకాశాలున్నాయని సంకేతాలు ఇస్తూనే, మరోవైపు సైనిక చర్యకు దిగినట్లు వార్తలు రావడం అమెరికా వ్యూహంపై సందేహాలను పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల అధికారిక ప్రకటనలు, తదుపరి పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

America Attack on Iran Donald Trump Iran Explosions Iran military strikes Middle East tensions Qeshm Island Attack US Iran conflict US Military Operations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.