📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US: ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానాలపై అసంతృప్తితో అమెరికన్లు

Author Icon By Vanipushpa
Updated: January 27, 2026 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇమిగ్రేషన్‌ విధానాలపై అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు . ట్రంప్‌ నిర్ణయాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. రాయిటర్స్‌-ఇప్సాస్‌ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. వలసలపై ఆయన తీసుకుంటున్న కఠినచర్యలు చాలాదూరం వెళ్లాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. దీనికి నిరసనగా జరిగిన ఘర్షణల్లో ఆ ఏజెంట్ల చేతిలో శనివారం మినియాపొలిస్‌లో మరో అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరం మరోసారి నిరసనలతో అట్టుడుకుతోంది. స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు స్మోక్ బాంబులు మరియు బాష్పవాయువును ప్రయోగించాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Read Also: PottiSriramulu: విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

US: ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ విధానాలపై అసంతృప్తితో అమెరికన్లు

ఈ ఘటనకు ముందు, తర్వాత అంటే శుక్రవారం నుంచి ఆదివారం మధ్య ఈ పోల్ చేపట్టగా.. ట్రంప్‌ నిర్ణయాలను ఆమోదించేవారి సంఖ్య తగ్గిపోయింది. తాజాగా 39 శాతం మంది ఆమోదించగా.. అంతకుముందు ఆ రేటు 41 శాతంగా ఉంది. 53 శాతం మంది ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

American public opinion border policy Immigration Reform political dissatisfaction Telugu News Paper Telugu News Today Trump Immigration Policies US immigration debate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.