Latest News: Hanuman Statue In US : హనుమాన్ నకిలీ దేవుడు అంటూ.. అమెరికా నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

Read Time:  1 min
Hanuman Statue In US
Hanuman Statue In US
FONT SIZE
GET APP

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ ల్యాండ్ నగరంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఇటీవలే 90 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహంను ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ (‘Statue of Union’) అనే పేరు పెట్టి, హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, వేదమంత్రాల నడుమ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు.

ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ (Alexander Duncan) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “టెక్సాస్‌లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం” అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్‌లోని వాక్యాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను వ్యతిరేకించారు.

డంకన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలని పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ (Texas Republican Party) కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మరోవైపు, చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తుచేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాగా, 2024లో ఆవిష్కరించిన ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ విగ్రహం, అమెరికాలోని అతిపెద్ద హిందూ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీ చిన్నజీయర్ స్వామి ఆలోచనలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.