📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: పాకిస్తాన్ కు అమెరికా ఫోన్ యుద్ధ వివరాలపై ఆరా

Author Icon By Sharanya
Updated: May 10, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ, ప్రపంచదేశాలు ఈ యుద్ధం ఆపాలని, రెండు దేశాల మధ్య చర్చలు జరపాలని స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా, ఐరాన్, చైనా వంటి దేశాలు, యుద్ధం ఆపటానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.

అంతర్జాతీయంగా పలుదేశాలు పాక్ కు కాల్

భారత్ పాక్ యుద్ధం అమెరికా వైఖరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఇవాళ కౌంటర్ ఆపరేషన్ బున్యన్ ఉల్ మర్సూస్ ను చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన పరిస్థితుల నేపధ్యంలో పలువురు ఈ యుద్ధం వద్దని జోక్యం చేసుకోవటానికి, చర్చలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం అంతర్జాతీయంగా పలుదేశాలు ముందుకొస్తున్నాయి. వీటిలో ఇరాన్, చైనా ఉండగా, యుద్ధం వద్దని చర్చలు జరపాలని అమెరికా సైతం కోరుతుంది.

అమెరికా మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో ఫోన్ కాల్

పాక్ ఆర్మీచీఫ్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్ చేశారు. పాక్ ఆర్మీచీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇరుదేశాల మధ్య చర్చల అవసరం పై దృష్టి పెట్టాలని మార్కో రూబియో ఆదేశాలు ఇచ్చారు.

జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు

శాంతి కాంక్ష ఇక ఇటీవల భారత్ పాక్ మధ్య యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తేల్చి చెప్పారు. రెండు అణు శక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడం పైన తాము ఆందోళన చెందుతున్నమని ఆయన పేర్కొన్నారు. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతి దిశగా కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి చర్చల అవసరం ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు తేల్చి చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రతకు చేరుకునే అవకాశాన్ని కట్టిపడేసే దిశగా ఉంటాయని వెల్లడించారు.

విమానాశ్రయాల మూసివేత

భారత్ పాక్ ఉద్రిక్తతలతో ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో, ఢిల్లీ విమానాశ్రయం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఇలా, భద్రతా ఉత్కంఠ నేపథ్యంలో విమానాలు సకాలంలో ఆగిపోవడం, ప్రయాణికుల రవాణా నిర్వాహణకు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోవడంతో, ఈ యుద్ధం ప్రపంచ భద్రతకు తీవ్రమైన సవాల్‌గా మారవచ్చు.

Read also: Ishaq Dar: భారత్ ఇక్కడ ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి

#IndiaPakistanConflict #IndiaPakistanTensions #JDVans #MarcoRubio #SouthAsiaCrisis #USPakistanCall #WarOrPeace #WarThreat Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.