📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: వైట్ హౌస్ కాల్పులు..వారిని విచారించాల్సిందే: ట్రంప్

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ (Trump) ధ్వజమెత్తారు. ఈ దాడులకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని పరోక్షంగా విమర్శలు చేశారు. కాల్పుల తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన వాడని అన్నారు. అతడు జో బైడెన్ అధికారంలోకి ఉన్నప్పుడే ప్రవేశించాడని ఆరోపించారు.

Read Also: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి

America White House shooting…they should be investigated: Trump

బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్గాన్ నుంచి వచ్చిన వాళ్లని మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాల్పులు జరగడంతో వాషింగ్టన్ లో మరో 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

కాల్పులు జరిపింది అఫ్గాన్ నిందితుడే

కాల్పులు చేసిన నిందితుడు అప్గానిస్థాన్ కు చెందిన రెహ్మనుల్లా లఖన్ వాల్ అని లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్లడించారు. 2021లో ఆఫ్ఘానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత భద్రత ఉండే ప్రదేశాల్లో వైట్ హౌస్ ఒకటి. కానీ ఇక్కడ కూడా అప్పుడప్పుడు నిరసనలు, దాడులు జరుగుతుంటాయి. అయితే ఆఫ్గాన్ కు చెందిన అతడు తాజాగా వైట్ హౌస్ వద్ద ఎందుకు కాల్పులు జరిపాడనేదానిపై క్లారిటీ లేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

America White House shooting Google News in Telugu Latest News in Telugu law enforcement. National Security political unrest Telugu News Today Trump demands investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.