అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వదంతుల కారణంగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. 79 సంవత్సరాల ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పెద్ద చర్చే నడుస్తున్నది. దీంతో ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. తన ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న సందేహాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానమిచ్చారు. కావాలంటే తన మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్) ఫలితాలను విడుదల చేస్తానని సోమవారం ఆయన చెప్పారు. అవి సమగ్రంగా ఉన్నాయన్నారు.
Read Also: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్
అయితే తన శరీరంలోని ఏ భాగంపై ఎమ్ఆర్ఐ (MRI test) పరీక్ష నిర్వహించారో తనకు తెలియదని చెప్పారు. ఆ పరీక్ష తన మెదడుపై అయితే కాదని, ఎందుకంటే గ్రహణశక్తి పరీక్షలో తను ఎంతో చురుగ్గా ఉన్నట్లు తెలిపారు.
ఏ భాగానికి వైద్యపరీక్షలు జరిగాయి..?
వృద్ధాప్యంలో ఉన్న ట్రంప్ (Trump) సహజంగానే వైద్యపరీక్షలు అవసరం ఉంటుంది. పైగా ఆయన ప్రస్తుతం అధ్యక్షుడు కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే అక్టోబరు నెలలో ట్రంప్ ఎందుకు వైద్యపరీక్ష చేయించుకున్నారు, వైద్యులు ఏ భాగానికి పరీక్ష నిర్వహించారు అన్న విషయాలను వైట్ హౌస్ ఇంకా బయటపెట్టలేదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: