వారెన్ బఫెట్ అంటేనే ప్రపంచంలోని తెలియనివారు బహుశా ఉండరేమో! టెక్ ఇన్వెస్టర్ గా ఆయనకు ప్రపంచఖ్యాతి ఉంది. అలాంటి ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆధునిక కార్పొరేట్(America) నాయకత్వ చరిత్రలో ఈ రోజు పెనుసంచలనం చోటు చేసుకుంది. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బుధవారం బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి రిటైర్ అవుతున్నరు. ఈ ఏడాది 95వ పుట్టిన రోజు జరుపుకొన్న బఫెట్, ఆరుదశాబ్దాల పాటు బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓగా సేవలు అందించడం విశేషం.
Read Also: Germany: జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం
ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో ఇదొక మైలురాయి. అత్యంత అసాధారణ నాయకత్వ పటిమను కనబర్చిన సీ ఈఓల్లో ఒకరిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బఫెట్ తొలిసారిగా 1965లో అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్నన్యూ ఇంగ్లండ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్టరర్ కంపెనీని కొన్నారు. తొలుత దాని టైక్టైల్ వ్యాపారాన్ని గట్టెక్కించిన ఆయన ఆ తదుపరి దశల్లో క్రమంగా తన పెట్టుబడులను బీమా, రైలుమార్గాలు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, కన్జూమర్ బ్రాండ్స్, షేర్లలోకి(America) మళ్లించడం మొదలుపెట్టారు. దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన దిగ్గ అమెరికన్ కంపెనీల్లో పెట్టిన క్రమశిక్షణాయుత పెట్టుబడులు అత్యద్భుత లాభాలను ఆర్జించాయి. దీంతో ఆయన సారథ్యంలోని బెర్క్ షైర్ హ్యాథనే మార్కెట్ విలువ ఏకంగా రూ.89 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్గా బఫెట్ కు ఖ్యాతి మిగిల్చింది. ఆయనతో పాటు వాటాదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
కొత్త సీఈఓ పగ్గాలు ఎవరికి?
బఫెట్ స్థానంలో బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ నూతన సీఈఓగా గ్రెగ్ అబెల్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. కెనడా వ్యాపారవేత్త అయిన గ్రెగ్ అబెల్ 2000 సంవత్సరంలో బెర్క్ షైర్ హ్యాథవేకు చెందిన జియో థర్మల్ ఎలక్ట్రిసిటీ కంపెనీ ‘మిడ్ అమెరికన్’లో సీఏగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2008లో ఆ కంపెనీకి సీఈవో అయ్యారు. ఆయన కృషిని వారెన్ బఫెట్ గుర్తించారు. అందుకే తన తర్వాత బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓగా గ్రెగ్ అబెల్ ను నియమిస్తానని 2025 మే నెలలోనే ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్న గ్రెగ్లిబెల్ ఎదుట పలు సవాళ్లు ఉన్నాయి. బెర్క్ షైర్ హ్యాథవే వద్ద దాదాపు రూ.34 లక్షల కోట్ల విలువైన భారీ నగదు నిల్వలు ఉన్నాయి. ఈ నగదు నిల్వలను బఫెట్ తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల్లోకి మరల్చడంలో గ్రెగ్ అబెల్ సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఆర్థిక సంక్షోభాలు ఉన్న టైంలో పెద్దసంఖ్యలో షేర్లు, కంపెనీలను కొనేందుకు ఇంత భారీ నగదు నిల్వలను వారెన్ బఫెట్ నిర్వహిస్తారు. బఫెట్ బాటలో పయనించేందుకు, తనపై ఆయన ఉంచిన ప్రగాఢ విశ్వాసాన్ని నిలుపుకునేందుకు గ్రెగ్ అబెల్ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: