అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకని రెండవసారి గెలిచాడో.. గెలవకుండా ఉండిఉంటే బాగుండేది ఈ పాట్లు మాకు ఉండేది కాదని భారతీయులు భావిస్తున్నారు. తన దేశపౌరులకు ఉపాధి కల్పనకు ట్రంప్ వీసా జారీలో కఠినమైన నిబంధనల్ని పెట్టారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ షరతుతో వీసాల జారీ ఆలస్యమవుతున్నాయి. వీసా అపాయింట్ మెంట్లు ఆలస్యమవుతున్న తరుణంలో నానాపాట్లు పడుతున్న హెచ్-1 వీసాదారులు నానా తిప్పలు పడుతున్నారు.
Read Also: Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…
హెచ్-1బీ, ఎల్, ఎఫ్, జే తదితర వీసాల ఇష్యూలో అవలంభిస్తున్న విధానాలు ఉద్యోగులకు, స్టూడెంట్లకు నరకంగా మారింది. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికా రావడమే కష్టమైపోయింది. అంటే ఆత్రేడీ వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15 నుంచి మొదలెట్టిన సోషల్ మీడియా స్క్రీనింగ్ వల్ల వీసా(America) అపాయింట్మెంట్లు అసలు దొరకడం లేదు. ఉన్నవి కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి. అది కూడా ఏకంగా ఎనిమిది, తొమ్మిది నెలలు వెనక్కు వెళ్లిపోయాయి. సోషల్ మీడియా స్క్రీనింగ్ కు చాలా టైమ్ పడుతోందని.. అందువల్లే వీసా అపాయింట్ మెంట్లలో జాప్యం జరుగుతోందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది. కానీ దీని వలన తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఉద్యోగులు అంటున్నారు.
హెచ్ ఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు..
తన వీసా పునరుద్ధరణ అపాయింట్ మెంట్ అకస్మాత్తుగా రీషెడ్యూల్ చేయడం వలన తాము పడుతున్న కష్టాలను హెచ్-1బీ ఉద్యోగులు పంచుకుంటున్నారు. దీని వల్ల తమ జీవితంలో స్పష్టత లేకుండా పోయిందని చెబుతున్నారు. దీని గురించి వర్ ప్లేస్ ఫోరమ్ బ్లైండ్ లో తన బాధలను పంచుకున్నారు. తన వీసా అపాయింట్ మెంట్ వాయిదా పడిందని.. దీంతో తన ఉద్యోగం ఉందో లేదో తెలియడం లేదని చెబుతున్నారు.
కంపెనీ కూడా దీని గురించి స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. జీతం రావడం లేదు.. అసలు ఉద్యోగం ఉంచారో లేదో కంపెనీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమోట్ వర్క్ చేస్తానని చెబుతున్నా హెచ్ ఆర్ సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. వీసా వచ్చేవరకు జీతం లేని సెలవులో ఉంటున్నా అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని.. వేరే ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: