📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధం.. వెనుజులా అధ్యక్షుడు

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా-వెవెజులా మధ్య గతకొంత కాలంగా తీవ్ర విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో పై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వెనెజులా తమదేశానికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నదని, తద్వారా తమ దేశ పౌరులు నేరాలకు పాల్పడుతున్నారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పలుమార్లు నికోలస్ ను ట్రంప్ హెచ్చరించారు. 

Read Also: Ukraine: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

దేశాన్ని వీడాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో తాను, తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Venezuelan Nicolas Maduro) పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

America Venezuelan President ready to leave the country with his family

ఆంక్షల నుండి ఉపశమనాన్ని కోరిన నికోలస్

గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే.. తాను వెనెజువలాను వీడేందుకు సిద్ధంగా ఉన్నానని మదురో తెలిపినట్లు సమాచారం.

యూఎస్ విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. దీంతోపాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజులా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి యూఎస్ ఉపశమనం కల్పించాలని కూడా ఆయన కోరినట్లు సమాచారం.

తిరస్కరించిన ట్రంప్

మదురో షరతుల్లో చాలావాటిని ట్రంప్ (Trump) తిరస్కరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ ఒక వారం రోజులు గడువు విధించినట్లుగా తెలుస్తోంది. అయితే, అది శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో వెనుజులా భూభాగంలో ఆపరేషన్లకు ట్రంప్ ప్రకటన చేసినట్లు సమాచారం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

America FamilyDeparture Google News in Telugu Latest News in Telugu PoliticalAsylum PoliticalCrisis PresidentExile Telugu News Today trump Venezuela VenezuelanPresident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.