📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల రూమర్స్ కు చెక్

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా (America) వెడ్డింగ్ రింగ్ తో ఉషా వాన్స్.. విడాకుల నూమర్స్కు చెక్ ఉపాధ్యక్షుడు జేడీ వవాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వివాహబంధంపై గత కొంతకాలంగా నెట్టింట జరుగుతున్న తీవ్ర చర్చకు తాజాగా తెరపడింది. ఉషా వాన్స్ చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని దర్శనం ఇవ్వడంతో ఆమె, జేడీ వాన్స్ (J.D. Vance) విడిపోతున్నారంటూ వస్తున్న వదంతులకు బలమైన సమాధానం లభించింది. నాలుగు రోజుల క్రితమే ఆమె వెడ్డింగ్ రింగ్ పెట్టుకోకుండా బయటకు రాగా.. అంతా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని భావించారు. కానీ తాజాగా అదే ఉంగరం పెట్టుకుని కనిపించి, అందరికీ క్లారిటీ ఇచ్చారు.

Read Also: Delhi blast: ఆమె నా భార్యే.. స్నేహితురాలు కాదు: ఉగ్ర డాక్టర్ ముజమ్మిల్

America Usha Vance with wedding ring.. check to divorce rumors

ఘనంగా థాంక్స్ గివింగ్ వేడుకలు

బుధవారం ఉపాధ్యక్షుడి కుటుంబం కెంటుకీలో అమెరికా సైనికులతో కలిసి థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్, ఉషాలతో పాటు వారి ముగ్గురు పిల్లలు కూడా పాల్గొన్నారు. ఉషా వాన్స్, జేడీ వాన్స్ దంపతులు స్వయంగా అమెరికన్ దళాలకు భోజనం వడ్డించారు. వారితో కలిసి అనేక విషయాలు మాట్లాడారు. ఈ హృదయపూర్వక సేవా కార్యక్రమంలో ఉషా వాన్స్ చేతికి మెరిసే వెడ్డింగ్ రింగ్ స్పష్టంగా కనిపించింది.

ఆ వార్తలో నిజం లేదు

ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఉషా వాన్స్ (Usha Vance) ప్రతినిధి ప్రయత్నించారు. ‘ఆమె ముగ్గురు చిన్న పిల్లల తల్లి. ఆమె రోజూ అనేక పాత్రలు కడగాల్సి ఉంటుంది. బహుశా అందుకే రింగ్ తీసి ఉంటారు’ అని ఆయన పేర్కొన్నారు. విడాకులకు సంబంధించిన వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఎవరూ వాటిని నమ్మలేదు. తాజాగా జరిగిన థాంక్స్ గివింగ్తో కనిపించడం.. వాన్స్ దంపతుల వైవాహిక బంధం దఢంగా ఉంది అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

America Politics Divorce Rumors Google News in Telugu Latest News in Telugu political spouse. public appearance Telugu News Today Usha Vance wedding ring

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.