📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: America: కొనసాగుతున్న షట్ డౌన్.. విమాన సేవల్లో కోత

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో(America) ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నది. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇంచుమించు అన్ని సంస్థల్లో ఈ ప్రభావం ప్రత్యక్షంగా పడుతున్నది. ఇంకా కొంతకాలం ఇలాగే కొనసాగితే పరిస్థితి చేజారిపోతుందని అమెరికా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల కారణంగా ఈ షట్ డౌన్ ప్రభావం ఏర్పడింది.

Read also: పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ఎలా గుర్తించాలి?

America: కొనసాగుతున్న షట్ డౌన్.. విమాన సేవల్లో కోత

విమాన సేవల్లో కోత

తాజాగా విమాన(America) సేవల్లో కోత విధించనుంది. ఈ మేరకు ఆ దేశ రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటన చేశారు. అది శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం రద్దీ అత్యధికంగా ఉన్న 40 విమానాశ్రయాల్లో 10శాతం విమానాలను రద్దు చేయనున్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్(Air traffic controllers) పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నారు. పరిస్థితి మరింత అదుపుతప్పితే అదనపు ఆంక్షలు విధిస్తామని మంత్రి డఫీ వెల్లడించారు. ఈ నిర్ణయంతో మొత్తం 1,800 విమానాలపై ఈ నిర్ణయం ప్రభావం పడనుంది. ఇక అంతర్జాతీయ సర్వీసుల అంశంపై స్పషత రాలేదు. అంతరిక్ష ప్రయోగాల్లో కూడా ఎఫ్ఎఏ మార్పులు తెచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

air-traffic-control airport-operations aviation-crisis flight-cuts government-shutdown Latest News in Telugu sean-duffy Telugu News transportation-department us-economy us-shutdown

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.