అమెరికా అంటేనే ఉద్యోగులు, విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలో వచ్చిన నాటి నుంచి వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను బలవంతంగా స్వదేశాలకు పంపుతున్నారు. (America) తాజాగా స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికైనా స్వయంగా లభించే హక్కు కాదని, అది పూర్తిగా ఒక ప్రత్యేక గౌరవం మాత్రమేనని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి సడలింపులు ఉండవని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉన్న విద్యార్థులు స్థానిక చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంబసీ స్పష్టంగా పేర్కొంది.
Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు
తక్షణమే వీసా రద్దు
అమెరికా (America) చట్టాల ఉల్లంఘన జరిగితే వీసాను తక్షణమే రద్దు చేయడం, విద్యార్థులను బలవంతంగా విదేశాలకు పంపించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిసింది. అంతేకాదు, కొంతకాలం పాటు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేయకుండా, బ్లాక్ లిస్ట్లో ఉంచడం, తీవ్రమైన సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశమూ ఉందని తెలిపింది. అధికారిక ప్రకటన చేసిన అమెరికా ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
భారతీయ విద్యార్థులు మాత్రమే కాకుండా, అమెరికాలో ఉన్న అన్ని విదేశీయులు అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని ప్రకటనలో సూచించింది. విద్యా, ఉద్యోగం లేదా ఇతర కారణాలతో అమెరికా వెళ్లిన వారంతా తమ వీసా షరతులు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్కింగ్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల మంజూరులో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున విద్యార్థులు కేవలం చదువుపై మాత్రమే కాకుండా, అక్కడి చట్టాలు, నిబంధనలపై సమానంగా దృష్టి పెట్టాలని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: