📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

America: వెనిజులాపై అమెరికా దాడి.. స్పందించిన భారత్

Author Icon By Saritha
Updated: January 4, 2026 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశాలతో ఆ దేశ దళాలు.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశంలో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో (America) అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న తాజా వివాదంపై భారత్ మొట్టమొదటిసారిగా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆ ప్రాంతంలో శాంతిని కోరుకుంటున్నట్లు తెలిపింది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యను బహిరంగంగా ఖండించినప్పటికీ.. భారత్ మాత్రం ప్రధానంగా మన దేశ పౌరుల భద్రత, చర్చల ద్వారా ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలనే అంశాలకే పరిమితమైంది. వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులాలో వేగంగా మారుతున్న పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని.. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది.

Read also: Maria Corina Machado: ‘స్వేచ్ఛా గడియలు’ మొదలయ్యాయి

వెనిజులాలో భారతీయుల భద్రతపై భారత్ ఆందోళన

సమస్యలను సంబంధిత పక్షాలు అన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ హితవు పలికింది. (America) ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదే సమయంలో ఆ దేశంలో ఉన్న భారతీయుల భద్రతపైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులాలోని భారతీయ పౌరుల క్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత అని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. వెనిజులాలో ఉన్న 80 మందికి పైగా భారతీయులతో (50 మంది ఎన్‌ఆర్ఐలు, 30 మంది పీఐఓలు) కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు.. భారతీయులకు ప్రయాణ హెచ్చరికలు కూడా విదేశాంగ శాఖ చేసింది. వెనిజులాకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. భారత ప్రభుత్వం తన పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగ ఉండాలని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Donald Trump india Indian Ministry of External Affairs International Relations Latest News in Telugu Nicolas Maduro Telugu News Venezuela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.