📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: హెచ్–1బీ వీసా హోల్డర్లపై ట్రంప్ కఠిన చర్యలు..175 మందిపై దర్యాప్తు!

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(America) అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ (Trump) ప్రభుత్వం ఈ వీసా కార్యక్రమంలో జరుగుతున్న దుర్వినియోగాలపై (Visa Abuse) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 175 కేసులపై దర్యాప్తు (Investigation) ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read Also: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

ట్రంప్ పరిపాలన హెచ్-1బీ వీసా (H-1B visa) దరఖాస్తులపై లక్ష డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలు) వన్ టైమ్ ఫీజును విధించిన వెంటనే.. కార్మిక శాఖ ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ద్వారా హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టి.. అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్ డీరెమర్ (Lori Chavez DeRemer) వెల్లడించిన వివరాల ప్రకారం, హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అమెరికా ఉద్యోగాలను రక్షించడానికి కార్మిక శాఖ తమ వద్ద ఉన్న ప్రతి వనరును ఉపయోగిస్తోందని, వెల్లడించారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడానికి.. అనుమానిత ఉల్లంఘనలపై తాను వ్యక్తిగతంగా దర్యాప్తులకు ధృవీకరణ ఇస్తున్నానని తెలిపారు.

ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ కార్మికులకే

డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో.. నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ కార్మికులకే దక్కేలా చూస్తామని ఆమె ఎక్స్ వేదికగా ప్రకటించారు.గత నెల సెప్టెంబరు 19వ తేదీన ట్రంప్ పరిపాలన ఈ లక్ష డాలర్ల ఫీజును ప్రకటించింది. అయితే స్టేటస్ మార్పు, బస పొడిగింపు కోరుకునే దరఖాస్తుదారులకు ఈ ఫీజు వర్తించదని అమెరికా (America) పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తర్వాత స్పష్టం చేసింది.

లక్ష ఫీజు నుంచి మినహాయింపులు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. హెచ్-1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగి ఉనికి అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరం అయినప్పుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఏ అమెరికన్ కార్మికుడు అందుబాటులో లేనప్పుడు.. ఆ ఉద్యోగి అమెరికా భద్రతకు లేదా సంక్షేమానికి ముప్పు కలిగించని వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Donald Trump H1B visa latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.