📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: బెడిసి కొట్టిన ట్రంప్ టారిఫ్..సీబీవో నివేదిక ఏం చెబుతోంది?

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలంచింది అంటారు పెద్దలు. అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇదే జరిగింది. రెండవసారి అధ్యక్షుడిగా పదవిని పొందిన నాటినుంచి ప్రపంచదేశాలకు అధిక టారిఫ్ లను ప్రకటిస్తూ, ట్రేడ్ వార్ కు (Trade war) దిగారు. దీనివల్ల అమెరికా ఆర్థికంగా వృద్ధి చెందుతుందని ట్రంప్ భావించారు. కానీ ట్రంప్ అధిక ట్రారిఫ్ లు ఆ దేశానికి పెద్దగా ప్రయోజనం కలగలేదని నివేదికలు చెబుతున్నాయి.

Read also : Crimes Tribunal: భుట్టో, హసీన లకు ఒకే పరిస్థితి ఉరిశిక్ష

America Trump’s threatening tariffs…what does the CBO report say?

పైగా అవి రివర్స్ గా దేశానికే నష్టాన్ని తీసుకొస్తున్నది. ట్రంప్ అనేక దేశాలపై భారీగా టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు భారీగా లాభం చేకూరిందని ట్రంప్ (Trump) కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. విదేశాల నుంచి దిగుమతి అయిన వస్తువులపై ట్రంప్ టారిఫ్ లు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సిబిఒ) వెల్లడించింది. ఈ టారిఫ్ ల వల్ల ఆమెరికాలో వాణిజ్య లోటు 4 ట్రిలియన్ డాలర్లు తగ్గుతుందని సీబీఓ మొదటగా అంచనా వేసింది. తాజాగా మూడు ట్రిలియన్ డాలర్లు మాత్రమే తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

సిబిఓ రిపోర్టును విడుదల చేసిన అమెరికా

ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ట్రంప్ సుంకాల ప్రభావానికి సంబంధించి సిబిఓ రిపోర్టును విడుదల చేసింది. అమెరికాలో 11ఏళ్లలో వాణిజ్య లోటు 2.5 ట్రిలియన్ డాలర్లు తగ్గుతాయని తెలిసింది. దీంతో ప్రభుత్వ ఖర్చులు కూడా 500 బిలియన్ డాలర్లు తగ్గుతాయని తెలిపింది. కానీ ఇవి ఆగస్టు అంచనాల కంటే తక్కువే. ఆ నెలలో వాణిజ్య లోటును 3.3 ట్రిలియన్ డాలర్లుగా, ప్రభుత్వ ఖర్చులు 700 బిలియన్ డాలర్లు మిగులుతాయని అంచనా వేసింది సిబిఓ.

టారిఫ్ ల యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇతర దేశాలపై టారిఫ్ ల యుద్ధం ప్రారంభించారు. అమెరికా ఉత్పత్తులను ఇతర దేశాల్లో పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు టారిఫ్ పేరుతో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కేవలం 3 ట్రిలియన్ డాలర్ల వరకు మాత్రమే వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు టారిఫ్ (tariff) పేరుతో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కేవలం 3 ట్రిలియన్ డాలర్ల వరకూ మాత్రమే వాణిజ్య లోటు తగ్గే ఛాన్స్ ఉందని సిబిఓ అంచనా వేసింది. దీంతో ట్రంప్ టారిఫ్ మంత్రం అంతగా పనిచేయలేదని స్పష్టమవుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

CBO report Donald Trump economic analysis Google News in Telugu international trade. Latest News in Telugu Telugu News Today trade policy failure US Tariffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.