📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: America: ట్రంప్ కొత్త చట్టంతో ఆంధ్రా ఆక్వారైతుకు గట్టి దెబ్బే!

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవిని స్వీకరించిన తర్వాత విదేశీ విధానంపై పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అధిక సుంకాలతో ట్రేడ్ వార్ కు దిగారు. వీసాల ఫీజులు గణనీయంగా పెంచి, విదేశీయుల రాకను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు రొయ్యలపై ట్రంప్ తన ప్రతాపాన్ని చూపుతున్నా, అమెరికా సుంకాలతో భారత ఆక్వా రంగం ఇబ్బంది పడుతోంది. తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా సెనెటర్లు ‘ఇండియా ష్రింప్ యాక్ట్’ (‘India Shrimp Act’) ను ప్రవేశపెట్టడంపై ఏపీలోని ఆక్వారైతులు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారులు నిరాశ చెందుతున్నారు.

ఇండియా నుంచి దిగుమతి చేసుకునే రొయ్యలపై దశలవారీగా సుంకాలు పెంచాలంటూ గతవారం సెనెటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హైడ్ స్మిత్ అమెరికన్ సెనెట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ‘లూసియానాలోని రొయ్యలు, క్యాట్ఫిష్ రంగాన్ని ఇండియా నుండి దిగుమతి అయ్యే రొయ్యల నుంచి కాపాడేందుకు వాటిపై అధిక సుంకాలు’అవసరమని’ క్యాసిడీ పేర్కొన్నారు. 2023లో సెప్టెంబరు 28న కూడా ఆయన ‘ఇండియా ష్రింప్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ బిల్లును ఫైనాన్స్ కమిటీకి రెఫర్ చేశారు. ఇప్పుడు మరోసారి బిల్లును సెనేట్ ముందుకు తీసుకొచ్చారు.

America

ఈ యాక్ట్ అసలు ఉద్దేశం ఏంటి?

భారత్ నుంచి రొయ్యల (Shrimp) దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించాలంటూ అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులు,ఎగుమతిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని అమెరికాకి ప్రధానంగా రొయ్యలు ఎగుమతి చేసే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భీమవరం ప్రాంతానికి చెందిన ఎక్స్ పోర్టర్లు అంటున్నారు.

వాస్తవానికి అక్కడి స్థానిక రొయ్యల రైతుల పరిరక్షణ కోసం సదరన్ ష్రింప్ ఎలయన్స్ (Southern Shrimp Alliance) అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోని డబ్లూఒటి నిబంధనల ప్రకారం ..యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నారు. అది చెల్లిస్తున్న తర్వాత కూడా ఇప్పుడు,మళ్లీ ఈ చట్టాలు ఏమిటో అర్థం కావడం లేదు’ అని అమెరికాతో సమా విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే భీమవరం ప్రాంతానికి చెందినవారు అంటున్నారు.

అమెరికాకే 60శాతం ఎగుమతులు

భారత్ లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దేశంలో ఏడాదికి 9లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తైతే అందులో 60శాతం ఉత్పత్తి ఏపీ నుంచి,ఉంటోందని ఏపీ మత్స్యశాఖ (AP Fisheries Department) జేడీ షేక్ మొహమ్మద్ అన్నారు. ఏపీ నుంచి అమెరికాకు నుమూరు 60 నుంచి 65శాతం రొయ్యల ఎగుమతి అవుతుండగా,మిగిలినవి చైనా, జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచే,ఎక్కువగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Donald Trump high tariffs India Shrimp Act latest news second term Shrimp Imports Telugu News Trade War US foreign policy Visa Fee Hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.