అమెరికా(America)లో ఔషధాల ధరలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రపంచంలో ఏ దేశంలో మందులు అత్యల్ప ధరకు లభిస్తాయో, అదే ధరను అమెరికా ప్రజలకు కూడా వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాకు ఔషధాలు ఎగుమతి చేసే భారత జనరిక్ ఔషధ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..
ప్రపంచంలోనే అత్యధిక ఔషధ ధరలు
ఈ ప్రకటన సందర్భంగా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖ ఫార్మా సంస్థల సీఈవోలు ట్రంప్‌కు తోడుగా ఉన్నారు. అమెరికన్లు దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యధిక ఔషధ ధరలు చెల్లిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇకపై ఆ పరిస్థితి మారబోతుందని, అత్యల్ప ధరలకే మందులు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.
పెద్ద ఫార్మా కంపెనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం కీలక ఔషధాల ధరలు 300 నుంచి 700 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ట్రంప్(Donald Trump) తెలిపారు. అవసరమైతే విదేశీ ప్రభుత్వాలపై టారిఫ్‌లను కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా అమెరికాలోనే ఔషధ తయారీని మరింత ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా ఔషధ మార్కెట్‌కు భారత్ ప్రధాన సరఫరాదారుగా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులను తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించడంతో, భారతీయ ఫార్మా కంపెనీలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: