📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: వివేక్ రామస్వామిని ప్రశంసల తో ముంచెత్తిన ట్రంప్

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సంతతికి చెందిన అమెరికన్(America) వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని(Vivek Ramaswamy) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను ‘ప్రత్యేకమైన వ్యక్తి’ (Something Special) అంటూ ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. వివేక్ రామస్వామి వచ్చే ఏడాది జరగనున్న ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా ట్రంప్ ఈ పోస్టు చేశారు.

 Read Also: Drugs: గంజాయ్ మత్తులో బస్సును ధ్వంసం చేసిన యువకులు

America

ట్రూత్ సోషల్ వేదికగా మద్దతు ప్రకటన

ట్రంప్ తన ట్రూత్ సోషల్ మాధ్యమం వేదికగా స్పందిస్తూ, ఒహాయో రాష్ట్రాన్ని ‘గ్రేట్ స్టేట్’గా అభివర్ణించారు. “ది గ్రేట్ ఒహాయో రాష్ట్రానికి వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. నాకు ఆ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. 2016, 2020, 2024 ఎన్నికల్లో నేను భారీ విజయం సాధించాను. వివేక్ నాకు బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతోనే పోటీకి వచ్చాడు. అతడు ప్రత్యేకమైన వ్యక్తి. వివేక్ యువకుడు, తెలివైనవాడు, చాలా మంచి వ్యక్తి. అతనికి మన దేశం అంటే ఎంతో ఇష్టం” అని ట్రంప్ పేర్కొన్నారు. వివేక్ రామస్వామి ఎన్నికైతే గొప్ప గవర్నర్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గవర్నర్‌గా వివేక్ లక్ష్యాలు

ఒహాయో తదుపరి గవర్నర్‌గా ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి వివేక్ కృషి చేస్తారని ట్రంప్ అన్నారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, వలస నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల సమగ్రతను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడుతారని ట్రంప్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Donald Trump Google News in Telugu Indian American Latest News in Telugu Ohio Ohio Governor Election Telugu News Today US Presidential Election Vivek Ramaswamy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.