📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: America: రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్.. ట్రంప్ దిగివచ్చేనా?

Author Icon By Saritha
Updated: November 4, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి విధానంలో తనదే పైచేయిలాగా ప్రవర్తిస్తున్నారు. దీంతో రిపబ్లికన్లకు, డెమోగ్రాట్లకు మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదు. ట్రంప్ ఎక్కడా తగ్గేట్టు కనిపించడం లేదు. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడంతో అక్కడి గవర్నమెంట్ మూతబడింది. 33 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వేలమంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. 4.2 కోట్లమంది పేద అమెరికన్లకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఆహార సహాయం బంద్ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాక్షిక ఆహార సహాయ చెల్లింపులను కవర్ చేయడానికి అత్యవసర నిధులను విడుదల చేయాలని పలువురు జడ్జిలు ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు పరిస్థితిని సులభతరం చేసే అత్యవసర నిధులను వైట్ హౌస్ నిలిపివేసిందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయినా కూడా ట్రంప్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు.

Read also: లండన్‌లో సీఎం – యూకే హైకమిషనర్‌తో భేటీ

America: రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్.. ట్రంప్ దిగివచ్చేనా?

నేనేమాత్రం రాజీ పడను: ట్రంప్

మాజీ(America) అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకువచ్చిన అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ చట్టం పునరుద్ధరించాలనే డిమాండ్ తో డెమోక్రాట్లు ఫెడరల్ సర్వీసులకు నిధుల విడుదలను ఆపేశారు. వీరితో బేరమాడే ప్రసక్తి లేదని.. రాజీ పడనని ట్రంప్ కుండబద్దలు కొట్టినట్లుగా తెలిపారు. అంతేకాదు డెమోరకాట్లే కాళ్లబేరానికి వస్తారని ట్రంప్ అన్నారు. వంద సీట్ల సెనెట్ లో నిధుల విడుదల చట్టం 60 ఓట్లతో ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ రిపబ్లికన్లకు 53 మంది సభ్యులు, డెమోక్రాట్లకు 45 మంది ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు నిధుల చట్టానికి అనుకూలగా ఓటు వేసినా కనీసం అయిదుగురు డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కూడా ఇదే చేస్తే నిధులు విడుదల అవుతాయి. అయితే ట్రంప్ అసలు ఈ మొత్తం రూల్ నే తీసిపారేయాలని సెనెట్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడిని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

Barack Obama Donald Trump Government Budget Crisis Latest News in Telugu Telugu News US Congress US government shutdown

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.