అమెరికా(America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ మధ్య ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతోంది. 2021లో తాను చేసిన ప్రసంగాన్ని దారితప్పే విధంగా ఎడిట్ చేసి చూపించారని ఆరోపిస్తూ, బీబీసీపై 5 బిలియన్ డాలర్ల వరకు పరువునష్టం కేసు(Defamation case) వేసేందుకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
Read Also: Donald Trump: భారత ఆహారోత్పత్తులపై సుంకాలను తగ్గించిన ట్రంప్
డాక్యుమెంటరీలో వక్రీకరణ ఆరోపణ
2021 జనవరి 6న అమెరికా(America) క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తమ డాక్యుమెంటరీలో తప్పుదోవ పట్టించేలా చూపించిందని ట్రంప్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. డాక్యుమెంటరీని ఉపసంహరించుకోవడం, క్షమాపణ చెప్పడం, అలాగే కనీసం ఒక బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని వారు బీబీసీకి గడువు విధించారు. ఈ ప్రదర్శన వల్ల తమ క్లయింట్ ప్రతిష్ఠకు గణనీయ నష్టం జరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ వివాదంపై బీబీసీ స్పందిస్తూ, ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు రీతిలో ఎడిట్ చేసిన విషయం నిజమేనని అంగీకరించింది. గురువారం ట్రంప్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా తెలిపింది. అయితే, తనపై దావా వేసేందుకు గట్టి చట్టపరమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
“వచ్చే వారం కేసు వేస్తాం” — ట్రంప్
ఫ్లోరిడా పర్యటనకు బయలుదేరే ముందు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “వారిపై 1 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు కేసు వేసే అవకాశం ఉంది. బహుశా వచ్చే వారం అది జరుగుతుంది. వారు నా మాటలను మార్చి ప్రదర్శించారు. తమ తప్పును అంగీకరించిన తర్వాత నేను చర్య తీసుకోవడం తప్పదు” అని అన్నారు. ఈ విషయంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో త్వరలో మాట్లాడతానని కూడా తెలిపారు.
బీబీసీ పనోరమా కార్యక్రమంలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగంలోని ముగ్గురు వేర్వేరు వీడియో భాగాలను కలిపి, ఆయన అల్లర్లకు ప్రోత్సాహం ఇచ్చినట్టుగా చూపించారని ట్రంప్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి విరుద్ధమనీ, పూర్తిగా పరువు నష్టం కలిగించే చర్యనీ వారు వాదిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: