📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America Trump : నేడు ట్రంప్, పుతిన్ ల చర్చలు ఫలించేనా?

Author Icon By Sai Kiran
Updated: August 15, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ దేశాలన్ని ఒక్కదాని గురించే మాట్లాడుకుంటున్నాయి.. రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధం ఆగిపోయేనా? లేదా కొనసాగుతుందా? ఎందుకంటే నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, (America Trump) రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. దీంతో అందరూ ఈ చర్చలు ఏవిధంగా కొనసాగనున్నాయో అని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణకు ఒప్పుకుంటే ఒక్క ఉక్రెయిన్ కే కాదు అమెరికాతో (America Trump) పాటూ చాలా దేశాలకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే రష్యాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయి.

భారత్ వంటి దేశాలపై అదనపు సుంకాల భారం తీసేయవచ్చును.

ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నారనే నెపంతో ఇండియా మీద 50శాతం సుంకాలను విధించారు. దీనికి భారత్ ఏమాత్రం ఒప్పుకోలేదు. అంతేకాదు రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయి.

శాంతి ఒప్పందం కుదిరేనా?

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో పలుమార్లు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపివేస్తానని ప్రగల్భాలు
పలికారు. 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపిస్తానని సంచల వ్యాఖ్యలు చేశారు. కానీ అవేవీ జరగలేదు. ట్రంప్క పుతిన్ కొరకరాని కొయ్యలా మారారు. పుతిన్తో భేటీకి ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో జెలెన్ స్కీతో ట్రంప్ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్ కు అనుకూలంగా మారినట్లే కనిపించాయి. కానీ ట్రంప్ కలలు ఏవీ నెరవేరలలేదు. పలుమార్లు ట్రంప్ పుతిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా పుతిన్ దేనికీ తగ్గలేదు.

చర్చలు విఫలం కావచ్చు

కాగా గురువారం జరగనున్న ట్రంప్-పుతిన్ ల చర్చలు విఫలం కావచ్చని రాజకీయ మేధావులు అంటున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా పేర్కొన్నారు. ట్రంప్ పుతిన్ తో ఎలాంటి ఒప్పందాన్ని ఖరారు చేయనని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఏ నిర్ణయాల్లోనైనా చేర్చుకుంటానని చెప్పారు. పుతిన్ ఇప్పటికే అలస్కా చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాధినేతలు మధ్యనా అలస్కాలోని యూఎస్ ప్రధాన సైనిక స్థావరం అయిన ఎల్మండోర్స్ వైమానిక దళ స్థావరంలో సమావేశం జరగనున్నది.

International Diplomacy Latest News in Telugu Telugu News Today Trump meeting Putin Trump Putin talks US Russia news US Russia relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.