అమెరికా అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ కొత్త ఆఫర్: స్వచ్ఛందంగా వెళితే $1000 ప్రోత్సాహకం
అమెరికాలో పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెరికాలో ఉండడం లేదని స్వచ్ఛందంగా అంగీకరించి వెళ్ళిపోవాలనుకునే వారికీ 1000 అమెరికన్ డాలర్ల నగదు సాయం అందించనున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారి ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించనుందని పేర్కొంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. స్వచ్ఛందంగా అమెరికా వదిలి వెళ్ళదలుచుకున్న వలసదారులు CBP One అనే మొబైల్ యాప్ ద్వారా తమ నిర్ణయాన్ని అధికారులకు తెలియజేయాలి. ఇలా సమాచారం ఇచ్చిన వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేయడం, బలవంతంగా పంపించడం వంటి చర్యలకు పాల్పడబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది వలసదారులకు భద్రతతో కూడిన తిరిగి స్వదేశం చేరుకునే అవకాశం కల్పించనున్నదని అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో అమెరికా హోంశాఖ మంత్రి నోయెమ్ ఒక ప్రకటనలో, “వలసదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటే, మేము వారి ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తిచేసేందుకు అన్ని విధాలుగా సహాయపడతాము” అని చెప్పారు. ఈ పథకాన్ని ‘సైఫ్ ఫండ్’ ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని మాటిచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ప్రారంభమైంది.
Trump : అమెరికా ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులకు కొత్త ఆఫర్ – $1000 ప్రోత్సాహకం
అయితే ఈ ప్రక్రియ వ్యయభారం ఎక్కువగా ఉండటంతో రిపబ్లికన్ ప్రభుత్వం అదనపు నిధుల అవసరాన్ని కాంగ్రెసుకు వివరించింది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 388 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించినట్లు సమాచారం. వారిలో 333 మంది అక్రమంగా అమెరికాలో ఉండేవారే కావడం గమనార్హం. బహిష్కరణకు గురైన భారతీయులలో 55 మంది ఇప్పటికే తూర్పు లేదా పశ్చిమ తీర ప్రాంతాల నుంచి స్వదేశానికి పంపబడ్డారు.ఈ ఆఫర్ ద్వారా ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు వలస చట్టాలను కఠినతరం చేస్తూనే, మరోవైపు స్వచ్ఛందంగా వెళ్లే వారికి ఆర్థిక సాయం చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించాలనుకుంటోంది. వలసదారులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు — ముఖ్యంగా అమెరికాలో తమ భవిష్యత్తుపై స్పష్టతలేని వారికీ.
Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష