📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: బైడెన్ ఆ ఆదేశాలన్నీ రద్దు చేసిన ట్రంప్

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీని స్వీకరించినప్పటి నుంచి రోజుకో నిర్ణయం తీసుకుంటూ, ప్రజలను పరుగులు తీయిస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక ప్రకటన చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో జారీ చేసిన ఆటోపెన్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Trump: చైనా మాస్టర్ ప్లాన్ తో అమెరికా విలవిల

వాటికి ఇకపై ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలిపారు. బైడెన్ హయాంలో దాదాపు 92శాతం ఈ ఆటోపెన్ తోనే సంతకాలు చేసినట్లు ట్రంప్ ఆరోపించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా బైడెన్ ను స్లీపీగా అభివర్ణించారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఆయన చురుగ్గాలేరని ట్రంప్ పదేపదే స్లీపీ అనే పదాన్ని వాడుతూ ఉపయోగిస్తుంటారు. ఈ మేరకు తన మీడియా సోషల్ ట్రూత్ వేదికగా వెల్లడించారు.

America Trump canceled all those orders Biden made

సంతకాల విషయంలో అధ్యక్షుడి అనుమతి 

ఆటో పెన్ అనేది ఒక యంత్రం. ఇది ఒక వ్యక్తి సంతకాన్ని లేదా చేతిరాతను కాపీ చేసి, పత్రాలపై వేయడానికి ఉపయోగిస్తారు. వైట్ హౌస్ లో దీనిని సాధారణంగా రద్దీగా ఉండే షెడ్యూల్ లో అనేక పత్రాలపై త్వరగా సంతకం చేయడానికి ఉపయోగిస్తారు. సంతకాల విషయంలో అధ్యక్షుడి అనుమతి తీసుకొని ఆటోపెన్ చేయాల్సి ఉంటుంది. 

అయితే బైడెన్ కు తెలియకుండా ఆ ఆటోపెన్ ను ఉపయోగించినట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లోకి కొన్ని దేశాల నుంచి చట్టవిరుద్ధంగా ప్రవేశించడాన్ని నిరోధించార. అన్ని ‘థర్డ్ వరల్ కంట్రీస్’ నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని పౌరులు కానివారికి ఇచ్చే అన్ని ఫెడరల్ ప్రయోజనాలు, రాయితీలను ఆపేస్తానని ట్రంప్ చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

America Politics Biden policies reversal Google News in Telugu government changes. Latest News in Telugu political transition presidential power Telugu News Today Trump executive orders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.