📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

America: హెచ్-1బి వీసాలపై లాటరీ విధానం రద్దు

Author Icon By Pooja
Updated: December 24, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈఏడాది జనవరిలో రెండోసారి అధికారంలో వచ్చారు. తన దేశపౌరులకే మొదటి ప్రాధాన్యత అంటూ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నవిధంగానే ట్రంప్ అమెరికా పౌరులకు ఉద్యోగాల కల్పనక కృషి చేస్తున్నారు. దీంతో వలసవాదులపై కఠిన చర్యలకుదిగారు. వీసా గడువు ముగిసిపోయి, అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా వెనక్కి పంపిస్తున్న విషయం విధితమే. అంతటితో ఆగకుండా విదేశీయుల రాకను భారీసంఖ్యలో తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ పొందుతున్నారు. కఠిన వీసా నిబంధనల వల్ల విదేశీయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ప్రపంచదేశాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వాణిజ్యయుద్ధంతో మొదలై, వీసాల పేరిట యుద్ధాన్నే చేస్తున్నారు ట్రంప్.

Read Also: Salehuddin Ahmed: దిగొచ్చిన బంగ్లా.. భారత్ తో బంధానికి యూనస్ యత్నం

America: The lottery system for H-1B visas has been abolished.

హెచ్-1బి వీసాలపై(America) ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హెచ్-1బి లాటరీ విధానాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో కొత్త పథకంతో భర్తీ చేస్తోంది. నైపుణ్యం కలిగిన కార్మికులు, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి.

ఫిబ్రవరి 27 నుంచి కొత్త నియమం

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం ఈ కొత్త నియమం ఫిబ్రవరి 27,2026 నుంచి అమల్లోకి రానుంది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం క్యావ్ రిజిస్ట్రేషన్ కు వర్తించనుంది. అంటే ఆ సంవత్సరం ప్రారంభమయ్యే ఉద్యోగాల కోసం మారిన, 2026లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సమాచారం. అయితే సాధారణ కోటా కింద ప్రతి ఏడాది ఇచ్చే 85,000 సంఖ్యను 65,000కి పరిమితం చేసినట్లు సమాచారం.

యజమాని సూచించిన విధంగా అధిక జీతాలు ఉన్నవారికి మాత్రం ఈ వీసాలు వర్తించనున్నాయి. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం భారతీయులకు ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్-1బి రెన్యూవల్ కోసం ఇండియాకు వచ్చి చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులకు కూడా తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందో లేదో అనే ఆందోళనలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu H1B Lottery System h1b visa changes Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.