📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనిజులా తీరం వెంబడి చమురు ట్యాంకర్ కు రక్షణగా రష్యా (Russia) జలాంతర్గామి, ఇతర నావికా దళాలను పంపింది. (America) ఇది అమెరికా-రష్యా సంబంధాలలో కొత్త సంచలనంగా మారిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. రష్యాసబ్మరీన్ తో పాటు మరికొన్ని నౌకలను పంపిందన్న వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం..‘బెల్లా 1’ అనే పేరుతో ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ వెనిజులాలో చమురు లోడ్ చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం రష్యా వైపు ప్రయాణిస్తోంది. రెండు వారాలుగా అట్లాంటిక్ సముద్రంలో అమెరికా కోస్ట్ గార్డ్ ఈ నౌకను వెంబడిస్తోంది. అమెరికా అభిప్రాయం ప్రకారం రష్యా ఆంక్షలు తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘డార్క్ ప్లీట్’లో ఈ నౌక భాగం. ఈ ప్లీట్ ద్వారా అక్రమంగా చమురు రవాణా జరుగుతోందని అమెరికా చెబుతోంది. డిసెంబర్ లో ఈ ట్యాంకర్ ను అదుపులోకి తీసుకునే అమెరికా ప్రయత్నం చేసింది. కానీ నౌక సిబ్బంది దాన్ని అడ్డుకున్నారు.

Read also: America: ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

రష్యా అమెరికాకు డిమాండ్

వెంబడించేటప్పుడు సిబ్బంది నౌకపై రష్యా జెండా వేశారు. అలాగే ‘మరినెరా’గా పేరు మార్చారు. (America) నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పరిశీలన లేకుండానే రష్యా ఈ నౌకకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది. దాంతో అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీనికి రక్షణ లభిస్తోంది. ఈ ట్యాంకర్ వెంబడించడం ఆపాలని రష్యా అమెరికాను డిమాండ్ చేసింది. రష్యా విదేశాంగ శాఖ ఈ నౌక పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని తెలిపింది. మరోవైపు, అమెరికా సైన్యం సౌత్ కమాండ్ ఈ ప్రాంతం గుండా వెళ్లే ఆంక్షల నైకలపై చర్యలకు సిద్ధంగా ఉన్నామని సోషల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్యాంకర్ ఐస్లాండ్ కు దక్షిణంగా సుమారు 300 మైళ్ల దూరంలో ఉత్తర సముద్రం వైపు సాగుతోంది. రష్యా ప్రభుత్వ మీడియా ఆర్టీ విడుదల చేసిన వీడియోలో ఒక పౌర నౌకను అమెరికా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



DarkFleet Latest News in Telugu OilTanker RussianNavy RussiaUSRelations Telugu News USCoastGuard VenezuelaCrisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.