📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: America: అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోని (America) బర్మింగ్‌హామ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోరమైన అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు తెలంగాణ విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. ఉన్నత విద్య (MS) అభ్యసించడం కోసం నాలుగేళ్ల క్రితం (2021లో) ఆమె అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్‌హామ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలిసింది.

Read Also: USA: అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

సహజారెడ్డి (Sahaja Reddy) స్వస్థలం మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, వెంకటాపూర్ గ్రామం. ఆమె తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందించారు. చదువు పూర్తి కావొచ్చిన సమయంలోనే ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకోవడంతో, ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రతిరోజూ తమ కుమార్తెతో వీడియో కాల్‌లో మాట్లాడేవారు, ఈ ఏడాది ఆమె ఇండియాకు వస్తుందని ఎదురుచూశారు. చివరికి తమ కుమార్తె మృతిచెందిందన్న వార్త విని గుండెలవిసేలా రోదించారు.

America Telangana student dies in apartment fire

తల్లిదండ్రుల వివరాలు మరియు నివాసం

సహజారెడ్డి తండ్రి, ఉడుముల జయాకర్ రెడ్డి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌ (TCS) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీ టీచర్‌గా పనిచేసి, ఇటీవల డిప్యుటేషన్‌పై హైదరాబాద్ (Hyderabad) ఎస్‌సీఆర్‌టీకి వెళ్లారు. కొన్నేళ్లుగా సహజారెడ్డి కుటుంబం హైదరాబాద్‌లోని జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో స్థిరపడింది.

జయాకర్ రెడ్డి, శైలజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే బీబీఎస్‌ కోచింగ్ తీసుకుంటోంది.

అపార్ట్‌మెంట్‌లోని పరిస్థితి

సహాజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. అర్థరాత్రి కావడంతో ఆమె నిద్రిస్తున్న సమయంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగినప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BirminghamApartmentFire Ghatkesar Google News in Telugu HyderabadFamilyGrief InternationalStudent Latest News in Telugu MSStudentDied SahajaReddy TelanganaStudentDeath Telugu News Today USAfireTragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.