పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పాకిస్థాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాలని అమెరికా పాకిస్థాన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని అగ్రరాజ్యం పాక్ ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని మంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తోనూ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తీరును రూబియోకు ఆయన వివరించారు. ఈ మేరకు ఈ ఘటనను ఖండిస్తూ.. దీని వెనకాల ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. అనంతరం ట్వీట్ ద్వారా తెలియజేశారు జైశంకర్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడినట్లు చెప్పారు.
పాక్ కు ఎలాంటి సమాధానం ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుంది: మోదీ
మరోవైపు ఈ ఘటనను మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. ఇది ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులకు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ కు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఇరు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరారు. మరోవైపు ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం
ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించిన రెండు కీలక వీడియోల ఆధారంగా ఉగ్రదాడిని ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్ లైన్ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేసింది. మరోవైపు భారత్ ఈరోజో, రేపూ తమపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోందని సమాచార మంత్రి అతుల్లా తరార్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే భారత్ ఈరోజు రాత్రికి దాయాది దేశంపై సర్జికల్ స్ట్రైక్ మొదలెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మే 02 ప్రధాని మోదీ భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.
Read Also: US Ukraine: ఖనిజాల అగ్రిమెంట్కు ఓకే చేసుకున్న అమెరికా, ఉక్రెయిన్