📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest Telugu News: US Nuclear: అణ్వాయుధ పరీక్షలకు సిద్ధమవుతున్న అమెరికా

Author Icon By Vanipushpa
Updated: November 3, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలంటూ ట్రంప్(Trump) తాజాగా జారీ చేసిన ఆదేశాలపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ మంత్రి క్రిస్ రైట్ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండవని స్పష్టం చేశారు. రష్యా, చైనా(Russia) (China) లతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అణ్వాయుధ పరీక్షలను మొదలు పెట్టాలని తమ దేశ యుద్ధ శాఖను ఆదేశించారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ విషయంపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ క్రిస్ రైట్ తాాజాగా స్పష్టతనిచ్చారు. తాజా పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండబోవని స్పష్టం చేశారు. అణ్వాయుధానికి సంబంధించి ఇతర వ్యవస్థలన్నీ లక్ష్యాల మేరకు పని చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పాత ఆయుధాలను భర్తీ చేయనున్న కొత్త ఆయుధాలపై ఈ పరీక్షలు నిర్వహిస్తామని కూడా వివరించారు.

Read Also: Womens Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అణ్వాయుధ పరీక్షలపై ట్రంప్ కామెంట్స్

అమెరికా దాదాపు 33 ఏళ్లుగా ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. అయితే, గురువారం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో సంచలన పోస్టు పెట్టారు. అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో సమావేశానికి ముందు ట్రంప్ చేసిన ఈ ప్రకటన కలకలం రేపింది. ఆ తరువాత శుక్రవారం కూడా ట్రంప్ మరోసారి అణ్వాయుధ పరీక్షలపై మళ్లీ అవే కామెంట్స్ చేశారు. అయితే, భూగర్భ అణు విస్ఫోటనాలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. రష్యా, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నా వాటి గురించి బయటకు చెప్పట్లేదని అన్నారు.

ఇవేవీ అణు విస్ఫోటనాలు కావు

ఈ నేపథ్యంలో రైట్ క్లారిటీ ఇచ్చారు. 1960, 1970, 1980ల్లో జరిపిన అణు పరీక్షల్లో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించామని అన్నారు. ఈ డేటా ఆధారంగా కంప్యూటర్‌ల సాయంతో నూతన బాంబు డిజైన్‌ల వ్యవస్థలను విశ్లేషిస్తామని వివరించారు. నియంత్రిత విధానంలో విస్ఫోటనాలను పరీక్షించినా ఇవేవీ అణు విస్ఫోటనాలు కావని తెలిపారు. పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం రష్యా వద్ద 5,449 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న అమెరికా వద్ద 5,277 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.

రష్యా మరియు చైనా మధ్య సంబంధం ఏమిటి?
రష్యా మరియు చైనాలు ఉమ్మడి రాజకీయ లక్ష్యాలు మరియు ఆర్థిక పరస్పర ఆధారపడటంలో పాతుకుపోయిన లోతైన, బహుముఖ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి, ఇది ఇటీవలి సంవత్సరాలలో, ముఖ్యంగా 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత గణనీయంగా పెరిగింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Defense Policy Google News in Telugu Latest News in Telugu Nuclear Strategy Nuclear Tests Telugu News online US Military

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.