📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) లో రాజకీయ ప్రతిష్ఠంభన తీవ్ర స్థాయికి చేరడంతో ఫెరడల్ ప్రభుత్వం మరోసారి షటౌడౌన్ లోకి వెళ్లింది. ప్రభుత్వ కార్యకాలాపాలకు అవసరమైన నిధుల బిల్లుపై అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా,దేశవ్యాప్తంగా పలు కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి.

Indian Americans : అమెరికాలో భారతీయులు ఎందుకు ముందుంటారు? వారి విజయం వెనుక ముఖ్య కారణాలు

డెమోక్రాట్ల డిమాండ్లను అంగీకరించం: రిపబ్లికన్లు

సెనేట్ లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయబిల్లును డెమోక్రాట్లు మంగళవారం అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ (‘Big Beautiful Bill’) లో ఆరోగ్య సంరక్షణకు విధించిన కోతలను రద్దు చేయాలను వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే. డెమోక్రాట్ల డిమాండ్లకు అంగీకరించేది లేదని రిపబ్లికన్లు స్పష్టం చేశారు.

America

నవంబరు 21 వరకు తాత్కాలికంగా నిధులు మంజూరు చేస్తామన్న వారి ప్రతిపాదనను కూడా డెమోక్రాట్లు తిరస్కరించారు.ఫండింగ్ బిల్లు (Funding Bill) ఆమోదం పొందాలంటే సెనేట్ లో 60ఓట్లు అవసరం కాగా, రిపబ్లికన్లకు ఏడు ఓట్లు తక్కువగా ఉన్నాయి.

తీవ్రంగా హెచ్చరించిన ట్రంప్

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవార డెమోక్రాటిక్ నేతలతో (Democratic leaders) జరిపిన చర్చలు విఫలమయ్యాయని, వారు ఏమాత్రం పట్టు సడలించలేదని విమర్శించారు. ‘షట్ డౌన్ విధిస్తే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది. చాలామందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తా’ అని ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ షట్ డౌప్ కారణంగా సరిహద్దు భద్రత, శాంతిభద్రలు,

ఎయిర్-ట్రాఫిక్ కంట్రోల్ వంటిఅత్యవసర సేవలు కొనసాగనుతన్నాయి. షట్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే, వేతనాలు లేకుండా పనిచేయాల్సి రావడంతో ఉద్యోగులు విధులకు గైర్హాజరై విమాన ప్రయాణాలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ట్రంప్ తన విధానలతో ఇప్పటికే అమెరికా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఆయన తన మొండి విధానాలపై పలువురు నేతలు మండిపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

America Breaking News budget impasse federal shutdown government crisis latest news political deadlock Telugu News US government shutdown US Politics Washington DC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.