📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

News Telugu: America: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన హైదరాబాద్ మహిళ

Author Icon By Rajitha
Updated: November 5, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

America: అమెరికాలో మరో భారత సంతతి మహిళ తన ప్రతిభతో చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మి, (gazala hashmi) వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఘన విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, రిపబ్లికన్ ప్రత్యర్థి జాన్ రీడ్‌పై విజయం సాధించారు. ఈ గెలుపుతో వర్జీనియా రాజకీయాల్లో ఆమె కొత్త అధ్యాయం ప్రారంభించారు. ఈ ఫలితంతో, గజాలా గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనెటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ప్రత్యేక ఎన్నిక జరగనుంది.

Read aslo: Global Superpower: “ఇండియా గ్లోబల్ సూపర్ పవర్” – ఇజ్రాయెల్ మంత్రి ప్రశంస

America: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన హైదరాబాద్ మహిళ

2019లో రాజకీయ రంగప్రవేశం చేసిన గజాలా, అప్పటి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీటును గెలుచుకుని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మరియు తొలి దక్షిణాసియా అమెరికన్ (America) మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు. తరువాత సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీ చైర్‌గా పనిచేశారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవి గెలుచుకోవడంతో ఆమె రాజకీయ జీవితంలో మరో మెట్టుపైకి ఎదిగారు.

గజాలా హష్మి 1964లో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి మరియు తన్వీర్ హష్మి. చిన్నతనంలోనే తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుమారు మూడు దశాబ్దాల పాటు విద్యా రంగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆమె భర్త అజహర్ రఫీక్, ఇద్దరు కుమార్తెలు యాస్మిన్ మరియు నూర్ ఉన్నారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సమానత్వం వంటి అంశాలపై ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Gazala Hashmi Indian American latest news Telugu News Virginia politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.