📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Latest News: America – నాగమల్లయ్య హత్య..ఎవరేమంటున్నారు?

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతవారం అమెరికాలోని డల్లాస్‌లో ఒక ఘోరమైన హత్య జరిగింది, ఇది భారతీయ సమాజంలో తీవ్ర ఆందోళన సృష్టించింది. మోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్య (Chandramouli Nagamallaiah) ను అతడి భార్య, కొడుకు కళ్ల ముందే దారుణంగా హత్య చేసాడు. క్యూబాకు చెందిన ఉద్యోగి మార్టినెజ్.నిందితుడు కత్తితో వెంబడిస్తున్న సమయంలో బాధితుడ్ని భార్య, కుమారుడు రక్షించడానికి ప్రయత్నించారు.

మోటల్‌లో మార్టినెజ్‌ గదిని శుభ్రం చేస్తుండగా.. పగిలిపోయిన వాషింగ్‌ మెషీన్‌ను ఉపయోగించవద్దని నాగమల్లయ్య చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని తనకు నేరుగా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగి ద్వారా చెప్పించడంతో మార్టినెజ్ (Martinez) ఆగ్రహానికి గురయ్యాడు.అయినాసరే హంతకుడు చివరికి అతన్ని పట్టుకుని కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో నాగమల్లయ్య జేబులో నుంచి మొబైల్ ఫోన్, కీ కార్డును తీసుకున్నాడు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

అనంతరం తల నరికి మొండెం నుంచి వేరిచేసి.. దానిని డస్ట్‌బిన్ వద్దకు తన్నుకుంటూ వెళ్లిన అందులో పడేసిన భయానక వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ అయ్యింది. హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎవరీ చంద్రమౌళి నాగమల్లయ్య?

చంద్రమౌళి బెంగళూరులో పెరిగారు. నగరంలోని తిప్పసంద్ర, ఆర్టీ నగర్‌లో ఉండేవారు. అతడ్ని కుటుంబసభ్యులు, స్నేహితులు ‘బాబ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. నాగమల్లయ్య ఫేస్‌బుక్ (Facebook) ప్రొఫైల్ ప్రకారం.. బెంగళూరులోని ఇందిరా‌నగర్ కేంబ్రిడ్జ్ స్కూల్‌లో ప్రాథమిక విద్య తర్వాత.. బసవనగుడి నేషనల్ కాలేజీలో ఉన్నత విద్య చదివారు.

బెంగళూరు (Bangalore) లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన.. 2018లో అమెరికాకు వలస వెళ్లారు. తొలుత శాన్ ఆంటోనియాలో తర్వాత డాలస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఆయనకు భార్య, కుమార్తె నిషా, కుమారుడు గౌరవ్ (18) ఉన్నారు. ఇటీవలే గౌరవ్ ప్లస్ 2 పూర్తిచేసి, కాలేజీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. నాగమల్లయ్య కుమారుడు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డిగ్రీని పూర్తిచేయడానికి కుటుంబం ఇప్పటికే రూ.3 కోట్ల విరాళాలు సేకరించింది.

America

డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు

అందరితో కలుపుగోలుగా ఉండేవారని అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం విచారకరమని బెంగళూరులో ఆయన నివాసం ప్రాంతంలో ఉండే కొందరు వ్యాఖ్యానించారు.”అతనిపై మీకు కోపం రాదు. మీకు కోపం వస్తుందంటే ఆయన వెంటనే మీ చేయి పట్టుకుని నవ్వుతారు” అని చంద్రమౌళి స్నేహితుడు హెచ్‌బీ వెంకటేష్చె ప్పారు.మరోవైపు, నాగమల్లయ్య హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో‘అక్రమ వలస నేరస్థుల పట్ల ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించకుండా అమెరికాను మళ్ళీ సురక్షితంగా’ ఉంచుతానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.‘టెక్సాస్‌లోని డల్లాస్‌లో చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన నివేదికల గురించి నాకు తెలుసు, ఆయనను క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు తన భార్య, కొడుకు ముందే దారుణంగా తల నరికి చంపాడు,

గతంలో చిన్నారులపై లైంగిక వేధింపులు

నిందితుడు మన దేశంలో ఇక ఉండకూడదు’ అని ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్టినేజ్‌ను గత జో బైడైన్ యంత్రాంగం వదలిపెట్టిందని విమర్శించారు. గతంలో చిన్నారులపై లైంగిక వేధింపులు సహా పలు భయంకర నేరాల్లో అరెస్టయ్యాడని పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తిని బైడెన్‌ మన దేశానికి తీసుకొచ్చాడని, ఎందుకంటే క్యూబా ఇలాంటి దుర్మార్గులను తన దేశంలో ఉంచుకోవాలనుకోలేదని అన్నారు. ఇకపై అక్రమ వలసదారులపై ఊపేక్షించబోమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trump-warns-netanyahu-again/international/548300/

bengaluru residents reaction Breaking News chandramouli friend hb venkatesh statement chandramouli kind nature friendly with everyone latest news shocking murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.