📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తున్న కాలంలో చంద్రుడు పైన కాలు మోపడం మాత్రమే కాదు, చంద్రుడి పైన జీవితాన్ని స్థాపించడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. చాలాకాలంగా భూమి మీద కాకుండా మనిషి ఎక్కడ జీవించాలి అనే దానిపైన పరిశోధనలు చేస్తున్న మన ఆస్ట్రోనాట్స్, చంద్రుడు పైన జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని గుర్తించారు. చంద్రుడిపైన హోటల్ చంద్రమండలం పైన నీరు, ఖనిజాల పైన ఇప్పటికే ప్రపంచవ్యాప్త అన్వేషణ కొనసాగుతున్న వేళ తాజాగా ఒక యూఎస్ కంపెనీ చంద్రుడి (Moon)పై ఏకంగా ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయించింది. ఈ క్రమంలోనే చంద్రుడు పైన హోటల్ నిర్మాణం చేయడానికి అమెరికన్ స్టార్టప్ కంపెనీ రంగంలోకి దిగింది. కాలిఫోర్నియాకు చెందిన గెలాక్సీ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ చంద్రుడు పైన హోటల్ నిర్మాణం చేపడతామని గత ఏడాది ప్రకటించింది.

Read Also: WEF: వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!

America: చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

చంద్రమండలం పైన ఆవాస గృహాలను ఏర్పాటు

హోటల్ నిర్మాణం మాత్రమే కాదు ఏకంగా బుకింగ్స్ కూడా ఈ సిలికాన్ వ్యాలీ సంస్థ చంద్ర పర్యాటకాన్ని లూనార్ ఎకానమీకి తొలిమెట్టుగా భావిస్తోంది. ఇప్పటికే చంద్రమండలం పైన ఆవాస గృహాలను ఏర్పాటు చేయాలని సైన్సు ఫిక్షన్ ఆలోచనా ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ఇక సదరు కంపెనీ వెబ్సైట్ హోటల్ నిర్మాణం మాత్రమే కాదు ఏకంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం హోటల్ రిజర్వేషన్లు 2.2 కోట్ల రూపాయల నుండి 9 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. మొత్తం ఖర్చు ఇలా చంద్రమండలానికి వెళ్లి హోటల్లో బస చేసి వచ్చే మొత్తం ప్రయాణానికి 90 కోట్లు దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది. అదనంగా తిరిగి చెల్లించని వెయ్యి డాలర్ల దరఖాస్తు రుసుము కూడా చెల్లించవలసి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

America space news future space travel lunar hotel plans moon hotel project NASA related developments private space companies space tourism startup Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.