📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest Telugu news : America – ప్రపంచ దేశాల మధ్య అమెరికా వెనుకడుగు తప్పదా!

Author Icon By Sudha
Updated: September 26, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవ్వుకొనే విషయమే అయినా, ట్రంప్ దెబ్బకు అమెరికా వరుల గిరాకీ ఇండియాలో తగ్గిందన్న వార్త చేదునిజంగానే ఉంటుంది. షేర్ మార్కెట్ లాభాలూ నష్టాలతో మానవ సంబంధాలను ముడిపడేట్లు చేసిన డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో చాలాకాలం మననంలో ఉంటారు. ఉరుము ఉరిమిమంగలం మీదపడ్డట్లు ట్రంప్ టారిఫ్ (Trump’s Tariff)ల దెబ్బ భారత్ ఆర్థిక స్థితిగతులను శాసించే చర్యగా ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నా, భారత ప్రధాని మాత్రం మన కాళ్లమీద మనం నిలబడే శక్తి కనీసం ఇప్పుడైనా తెచ్చుకోవాలని జ్ఞాపకం చేయటం అర్థవంతంగా ఆచరించే విధంగానే ఉంది. అంత మాత్రాన ప్రధాని మోడీతోసహా అంతకు మునుపు అధికారంలో ఉన్న నాయకులు భారత్ ఆర్థిక ప్రయోజనాలను పట్టించుకోలేదని విమర్శించటం హేతు బద్ధంగా ఉండదేమో! ఏ దేశ విధానాలైనా ఆదేశ అవస రాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటాయి. వలసవాదుల నుంచి విముక్తి పొందిన యు.యస్.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) బహు తక్కువ జనాభాతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా ఎక్కువ విస్తీర్ణం గల భూభాగాన్ని ఆర్థికవనరులను ఉత్పత్తి చేసేవిధంగా కాలక్రమేణా మార్చుకుంది. అంతేగాదు మానవ వనరులు అభివృద్ధికి ముఖ్యమని భావించి, తమ దేశంలోకి అందరూ ఆహ్వానితులే అన్న దార్శనికతో ఇతర దేశస్థులను నిండు మనసుతో ఆహ్వానించి, తద్వారా దేశాభివృద్ధిని అన్ని విధాలా సాధించుకోగలిగింది. ముఖ్యంగా డాలర్ను సంపదకు ట్రేడ్ మార్కెట్గా గుర్తింపు తెచ్చుకొని ఇతర దేశాలు సహాయ సహకారాలతో అభివృద్ధి చెంది, సరైన నాయకత్వంతో శ్రమించి అగ్రరాజ్యంగా ప్రత్యేక స్థానాన్ని కొన్ని సంవత్సరాలలోనే సాధించుకోగలిగింది. అందుకు ఆ దేశ ప్రజలూ, నాయకులూ అందరూ అభినంద నీయులే. అంతవరకు బాగానే ఉంది. అటు తర్వాత తమతో సమంగా కమ్యూనిస్టు దేశాలు మొదలు
యుయసస్ఆర్, తర్వాత చైనా అగ్రరాజ్యాలుగా దాదాపు సమస్థాయిలో అభి వృద్ధి చెందిన తర్వాత ప్రపంచ రాజ్యాధినేతగా అన్ని దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే కాంక్షతో ఈ దేశాల మధ్య పోటీ ద్విగుణీకృతమైంది. అప్పుడే అలీన విధానంతో భారత్, జవహర్లాల్ నాయకత్వంతో కొన్ని ఆసియా, అరబ్ దేశాలతో జమకట్టి కోల్డ్వర్కు అడ్డుకట్ట వేయగలిగింది. ఎప్పుడైతే సోవియెట్ యూనియన్ చిన్నాభిన్నమైందో, అమెరికా (America)పైచేయి సాధించటానికి అర్రులు చాచింది.

America – ప్రపంచ దేశాల మధ్య అమెరికా వెనుకడుగు తప్పదా!

చైనా కూడా ఆర్థికంగా బలపడి అటు అమెరికాకు, ఇటు బలహీనపడిన రష్యాకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా (America) అధ్యక్షుడిగా ఎంపిక అయ్యేంతవరకు విభిన్న దేశాల మధ్య ఉన్న ఘర్షణలూ, పొరపొచ్చాలు (ఉదా హరణకు ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇండియా-పాకిస్థాన్ల మధ్య ఘర్షణలు) అగ్రదేశాల మధ్య రాజకీయ పోరుకు దారి తీయలేదు. రష్యాతో విడిపోయిన ఉక్రెయిన్ అమెరికా (America)పంచన చేరగానే అమెరికాకు ఉక్రెయిన్ గనుల మీద కన్ను పడింది. రష్యాతో ఘర్షణలతో సతమత మవుతున్న ఉక్రెయిన్ ను ఆ మెరికా దగ్గరకుతీసి అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ఇజ్రాయిల్ కూడా అమెరికా అండ చూసుకొని గాజా భూభాగాన్నిఆక్రమించుకొని పాలస్తీన్లను దెబ్బ తీసే ప్రయత్నంలో పడింది. ట్రంప్ చట్టాలను లెక్క చేయకుండానే కాంగ్రెసు ప్రత్యేకంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటే టీవ్స్ ను తన విధానాలకు అనుకూలంగా మార్చుకొనే ప్రయ త్నాలు చేసుకోవటంలో కొంత విజయం సాధించారు. స్పీకర్ ఆఫ్ ది హౌస్ కూడా అడుగులకు మడుగులొత్తే ధోరణి కనపరుస్తున్నట్లు అమెరికాలోని రాజకీయ వర్గాల భావన. అమెరికా దేశంలోని ప్రజలు ఇంకా ట్రంప్ నిష్క్రియోజకత్వా న్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు లేదు. ప్రపంచ అవనిక కొంచెం కొత్తగా, గజిబిజిగా కనపడుతున్న మాట నిజం. నిన్నమొన్నటి దాకా చైనా, పాకిస్థాన్కు అండగా ఉంటూ భారత్ను శత్రుదేశంగా దూరంచేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ తో తల ముక్కలయి, పాత స్నేహితుల ఇబ్బందులు పట్టిం చుకోలేని పరిస్థితిలో పడింది. అమెరికా ట్రంప్ అడ్డగోలు వ్యవహారాలతో మొదటిసారి అమెరికా విదేశాంగ విధానాన్ని ఎవరికీ అర్థంకాని రీతిలో తలకిందులు చేసి చిన్న పిల్లవాడు గెంతులేసినట్లు నేనే ఎన్నో యుద్ధాలను ఆపాను! నావల్లే చాలా మంది మరణావస్థ నుంచి తప్పించుకున్నారు. అందు కని నోబెల్ బహుమతి నాకు లభించినా ఎవరూ ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని బింకాలుపోతున్నాడు.

America – ప్రపంచ దేశాల మధ్య అమెరికా వెనుకడుగు తప్పదా!

రష్యా, చైనాలు ప్రపంచపరిస్థితుల్లో సమతుల్యత కోల్పోయిన విధానాన్ని ఇప్పుడు గమనించినట్లయింది. అందుకే ఆసియాలో గట్టిపట్టుతో అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తున్న భారత్ను తమతో చేర్చుకొని అమెరికా అహంభావానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. అందుకు అనుగుణంగా రష్యా, చైనా, భారత్ల మీద ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు అర్థం లేనివని, తగు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరికలు చేస్తున్నది. ట్రంప్ యధావిధిగా ఎంతో సహాయకారిగా ఉన్న తనను కాదని భారత్, రష్యా, చైనాల పంచన చేరి మోసా నికి పాల్పడుతున్నదని యూరప్ దేశాల సహాయ సానుభూతులకోసం ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ గాజాతో యుద్ధాన్ని ఆపకుండా వెస్ట్బాంక్లో సెటిల్మెంట్స్ సంపాదించుకొనేం దుకు ముందు ముందుకుపోతే, యూరప్ దేశాలు ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఆపేసే అవకాశం ఉంది. వెస్ట్బ్యంక్ను ఆక్యుపై చేసుకోకుండా ‘రెడ్లైన్’ను యూరప్ దేశాలు ప్రకణించొచ్చు కూడా. నెతన్యాహు, ఇజ్రాయెల్ అధినేత గోడ మీద రాతను చూడటం లేదు. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం, అమెరికా బలహీనపడుతున్న ఈ తరుణంలో సంభవించే అవకాశం ఉంది. యుద్దాలలో గెలు పు వాకిటనే ఓటమి కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ఎన్నో సాహసోపేతమైన ఘర్షణలను ఎదుర్కొని విజయాలను సాధించింది కానీ ఎల్లకాలమూ విజయం దక్కటం కష్టమే. గతంలో యూరప్, అమెరికాతో సహా ఇజ్రాయెల్కు అండగా నిల్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటంలేదు. ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ఒంటెద్దుపోక డలను సహించే స్థితి కనుమరుగవుతున్నది. ఆసియా దేశా లలో భారత్, చైనా ఒకటిగా ముందడుగు వేసే పరిస్థితులు తాత్కాలికమే అయినా, కనపడుతున్నాయి. రష్యా అమెరికా తో సఖ్యత చాలుఅన్నట్లు ఈ మధ్యకాలంలో క్రమేపీదూరం జరుగుతుండడంతో ఇతర దేశాలు కూడా ఆలోచనల్లో పడ్డా యి. పాకిస్థాన్, భారత్తో ఘర్షణలకు దిగకుండా కొంతకాలం విదేశీ వ్యవహారాలల్లో స్థబ్దుగా ఉండే అవకాశాన్నికూడా కాదనలేం. బలహీనపడుతున్న బంగ్లాదేశ్, నేపాల్, అఫ్ఘాని స్థాన్ లాంటి దేశాలూ, అరబ్ దేశాలతోసహా రష్యా, చైనా, భారత్ నాయకత్వంలో అమెరికాకు దూరంగా జరగటమే కాకుండా, తమ అవసరాల కోసం తలపడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలివి తక్కువగా అనవసరంగా ప్రపంచ రాజకీయాలను చిన్నాభిన్నం చేసి అనుభవరాహి త్యాన్ని చాటుకోవటంతో ఈ పరిస్థితులు దాపురించాయి. అన్ని దేశాలనూ, తమ ప్రయోజనాల కోసం ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అమెరికా భావిస్తే ఇతర దేశాలు చూస్తూ ఊరు కుంటాయా? రాజకీయాల్లో స్వలాభమే వ్యక్తికైనా దేశానికైనా పరిగణనలో ఉంటుంది. అందుకనే భవిష్యత్తు యు.యన్ బలహీనపడిన ఈ తరుణంలో ఏ విధంగా మల్చబడుతుం దో కాకలు తీరిన నిపుణులు కూడా అంచనాలు వేయలేకుం డా ఉన్నారు. అమెరికాకు మాత్రం తన మాట నెగ్గించుకొనే పరిస్థితి లేదని నిపుణులు ఖండితంగా చెప్తున్నారు.

-రావులపాటి సీతారాం రావు

అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ దేశంలో ఒక సమాఖ్య జిల్లా, వాషింగ్టన్, డి.సి. మరియు ఐదు ప్రధాన భూభాగాలు కూడా ఉన్నాయి. సమాఖ్య జిల్లా మరియు భూభాగాలతో పాటు 50 రాష్ట్రాలు మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఏర్పరుస్తాయి.

USA మరియు అమెరికా మధ్య తేడా ఏమిటి?

“అమెరికా” అనేది ఉత్తర మరియు దక్షిణ అమెరికా అనే రెండు ఖండాలను సూచిస్తుంది, అయితే “USA” అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నిర్దిష్ట దేశం. సాధారణ ఆంగ్లంలో, ప్రజలు తరచుగా USA ని సూచించడానికి “అమెరికా” అనే పదాన్ని సంక్షిప్తీకరించడానికి ఉపయోగిస్తారు, కానీ సాంకేతికంగా, USA అనేది అమెరికా ఖండాల యొక్క పెద్ద భూభాగంలో ఒకే దేశం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

America Breaking News geopolitical shift Global Politics International Relations latest news Telugu News US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.